ATA Celebrations: జన్మభూమి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలన్న ఉపాసన.. మట్టిని కాపాడుకోవాలని సద్గురు పిలుపు..

| Edited By: Anil kumar poka

Jul 04, 2022 | 11:08 AM

ఆటా రెండోరోజు సాయంకాల కార్యక్రమానికి సద్గురు జగ్గీవాసుదేవ్, మెగా కోడలు ఉపాసన కొణిదెల, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, సినీతారలు రకుల్, అడివి శేష్ సహా పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు

ATA Celebrations: జన్మభూమి అభివృద్ధిలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యం కావాలన్న ఉపాసన.. మట్టిని కాపాడుకోవాలని సద్గురు పిలుపు..
17th Ata Conference
Follow us on

ATA Celebrations: అమెరికన్ తెలుగు అసోసియేషన్ 17వ మహాసభలు అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ  ఆటా వేడుకలకు భారత్ నుంచి భారీ సంఖ్యలో అతిథులు హాజరుకావడంతో.. వాషింగ్టన్ డీసీ కళకళలాడుతుంది. రెండో రోజు శనివారం ఉల్లాసభరితమైన వాతావరణంలో వేడుకలు జరిగాయి.  ఆటా అధ్యక్షుడు భువనేశ్ భుజాల, కన్వీనర్ బండారు సుధీర్ లు హాజరైన ప్రతినిధులకు స్వాగతం పలికారు. ఈ వేడుకలకు అమెరికా నలుమూలాల నుండి తెలుగు వారు హజరవుతున్నారు.

రెండోరోజు సాయంకాల కార్యక్రమానికి సద్గురు జగ్గీవాసుదేవ్, మెగా కోడలు ఉపాసన కొణిదెల, ఎమ్మెల్సీ కవిత, మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, సినీతారలు రకుల్, అడివి శేష్ సహా పలువురు ప్రవాసాంధ్ర ప్రముఖులు హాజరయ్యారు. శనివారం సాయంత్రం వేడుకలను ఉపాసన తన  ప్రసంగంతో ప్రారంభించారు. జన్మభూమి అభివృద్ధిలో, ఆరోగ్యపరమైన సేవా కార్యక్రమాల నిర్వహణలో ప్రవాసాంధ్రులు భాగస్వామ్యులు కావాలని ఉపాసన కోరారు.

ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్ వేడుకల్లో ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.  ఈ వేడుకల్లో సద్గురు మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల వలన సంభవించే నష్టాలను నివారించుకోవడం కోసం.. మనం అందరం మట్టిని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలిపారు. మనుషులు మనస్సును కూడా శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఆటా ఆధ్వర్యంలో…  ప్రవాస తెలుగువారిని కలిసే అవకాశం కల్పించిన ఆటకు సద్గురు ధన్యవాదాలు చెప్పారు. ప్రముఖ టాలీవుడ్ తమన్ సంగీత విభావరితో ఆహుతులను అలరించారు.

ఇవి కూడా చదవండి

 

మార్నిం గ్లోబల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..