విమానంలో అసభ్యంగా ప్రవర్తించి.. దాడి చేసినందుకు ఆ వ్యక్తిని ఏం చేశారంటే..?

విమానంలో ఇద్దరు మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఒకరి ముఖంపై పిడి గుద్దులు కురిపించిన ఓ ప్రయాణికుడికి విమాన సిబ్బంది..

విమానంలో అసభ్యంగా ప్రవర్తించి.. దాడి చేసినందుకు ఆ వ్యక్తిని ఏం చేశారంటే..?
Frontier Airlines Passenger Taped To Seat In Us

Edited By: Phani CH

Updated on: Aug 05, 2021 | 6:11 PM

విమానంలో ఇద్దరు మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక.. ఒకరి ముఖంపై పిడి గుద్దులు కురిపించిన ఓ ప్రయాణికుడికి విమాన సిబ్బంది..తోటి ప్రయాణికులు వింత ‘శిక్ష’ విధించారు.వివరాల్లోకి వెళ్తే.. ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం ఫిలడెల్ఫియా నుంచి మయామీకి వెళ్తుండగా..ప్రయాణికుడొకరు అమాంతంగా లేచి ఇద్దరు మహిళా ఫ్లైట్ అటెండెంట్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.., పైగా మరో వ్యక్తిపై దాడి చేశాడు. 22 ఏళ్ళ మాక్స్ వెల్ చెర్రీ అనే ఇతగాడి చేష్టలతో ఆగ్రహించిన విమాన సిబ్బంది, ఇతర ప్రయాణికులు అతడ్ని గట్టిగా పట్టుకుని అతడ్ని డక్ట్ టేపుతో సీటుకు బిగించేశారు. కదలకుండా..అరిచి గోల పెట్టకుండా నోటికి ప్లాస్టర్ కూడా బిగించారు. విమానం మయామీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని చేరుకునేంతవరకు అతగాడిని అలా బంధించారు. ప్లేన్ దిగగానే పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

విమాన ప్రయాణికుల భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యమిస్తామని, ఎవరు ఇలా అనుచితంగా, దురుసుగా దౌర్జన్యపూరితంగా ప్రవర్తించినా సహించబోమని వారిని శిక్షిస్తామని ఫ్రాంటియర్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం హెచ్చరించింది. ఈ ప్రయాణికుడు ఎందుకు అలా ప్రవర్తించాడో ఇంకా తెలియదు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: IPS Parade: ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ రేపు.. నేషనల్ పోలీస్ అకాడమీలో 178 మంది ఐపీఎస్‌లకు 58 వారాల శిక్షణ పూర్తి

ఆఫ్ఘనిస్తాన్ పై చర్చకు మూడు దేశాలకు రష్యా ఆహ్వానం.. ఇండియాకు మొండిచెయ్యి