ఫ్రాన్స్ లో మసూద్ అజర్ ఆస్తుల స్వాధీనం
పారిస్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశమైన ఫ్రాన్స్ చర్యలకు సిద్ధమైంది. అతని ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మూడు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అయితే చివరి నిమిషంలో చైనా మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. కాగా ఇప్పుడు […]

పారిస్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశమైన ఫ్రాన్స్ చర్యలకు సిద్ధమైంది. అతని ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మూడు దేశాల్లో ఫ్రాన్స్ కూడా ఒకటి. అయితే చివరి నిమిషంలో చైనా మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఇతర చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించింది. కాగా ఇప్పుడు ఫ్రాన్స్ ఆ పని మొదలుపెట్టింది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో యురోపియన్ యూనియన్ ప్రత్యేకంగా ఓ జాబితాను నిర్వహిస్తోంది. ఆ జాబితాలో మసూద్ పేరును చేర్చే అంశంపై చర్చిస్తామని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం, ఈ దాడి తమ పనే అని జైషే మహ్మద్ ప్రకటించడంతో మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న డిమాండ్‌కు మద్దతు క్రమంగా పెరుగుతున్నది. కేవలం చైనా మాత్రమే ఈ ప్రతిపాదనను అడ్డుకుంటూ వస్తున్నది.