రష్యాలో ఘోర విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి..

|

Jun 08, 2024 | 6:42 AM

ఇప్పటి వరకూ వోల్ఖోవ్ నది నుంచి రెండు మృతదేహాలను వెలికితీశాయి. ఈ సంఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులంతా 18-20 ఏళ్ల మధ్య వయసువారే. ప్రమాదానికి గురైన ఐదుగురు విద్యార్థులు మహారాష్ట్రకు చెందినవారు. జల్గావ్ జిల్లాలోని భద్గావ్‌కు చెందిన అనంతరావ్ దేసాలే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎన్నో కలలో రష్యాలోని యారోస్లావ్-ది-వైజ్ నోవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో ఐదు నెలల క్రితం మాత్రమే అడుగు పెట్టాడు

రష్యాలో ఘోర విషాదం.. నదిలో మునిగి నలుగురు భారతీయ విద్యార్ధులు మృతి..
Four Indian Students Drown In Russia
Follow us on

ర‌ష్యాలో ఘోర విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. న‌లుగురు భార‌తీయ వైద్య విద్యార్థులు న‌దిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీట‌ర్స్‌బ‌ర్గ్ స‌మీపంలో ఉన్న న‌దిలో వాళ్లు మునిగిపోయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. ఆ విద్యార్థుల మృత‌దేహాల‌ను భార‌త్‌కు పంపించేందుకు అన్ని చ‌ర్యలు తీసుకున్నట్లు భార‌త రాయ‌బార కార్యాల‌యం వెల్లడించింది. మృతిచెందిన విద్యార్థులు నోవోగ‌రోడ్ సిటీలోని స్టేట్ యూనివ‌ర్సిటీలో మెడిషన్ చదువుతున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. ఓ అమ్మాయి న‌ది నీటిలో కొట్టుకుపోతున్న స‌మ‌యంలో ఆమెను ర‌క్షించేందుకు మిగతా ముగ్గురు న‌దిలోకి దిగారు. దాంతో వాళ్లు కూడా ఆ న‌ది నీటిలో కొట్టుకుపోయారు. వాళ్లతో ఉన్న మ‌రో ఓ విద్యార్థి మాత్రం ప్రాణాలతో బ‌య‌ట‌ప‌డ్డారు. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ విద్యార్థికి చికిత్స అందిస్తున్నట్లు మాస్కోలోని ఇండియ‌న్‌ ఎంబ‌సీ పేర్కొంది.

ఇప్పటి వరకూ వోల్ఖోవ్ నది నుంచి రెండు మృతదేహాలను వెలికితీశాయి. ఈ సంఘటనలో మరణించిన మరో ఇద్దరు విద్యార్థుల మృత దేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. విద్యార్థులంతా 18-20 ఏళ్ల మధ్య వయసువారే.

ప్రమాదానికి గురైన ఐదుగురు విద్యార్థులు మహారాష్ట్రకు చెందినవారు. జల్గావ్ జిల్లాలోని భద్గావ్‌కు చెందిన అనంతరావ్ దేసాలే విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని ఎన్నో కలలో రష్యాలోని యారోస్లావ్-ది-వైజ్ నోవ్‌గోరోడ్ స్టేట్ యూనివర్శిటీలో ఐదు నెలల క్రితం మాత్రమే అడుగు పెట్టాడు. అంతేకాదు మృతుల్లో ఇద్దరు అక్కచెల్లెళ్ళు అష్పాక్ పింజారి, జియా ఫిరోజ్ పింజారిలు, ముంబైకి చెందిన మాలిక్ గులామ్‌గౌస్ మహ్మద్ యాకూబ్ లు మృతులను గుర్తించారు. అయ్తీ ప్రాణాలతో బయటపడిన ప్రాణాలతో బయటపడిన ఏకైక విద్యార్థి పూణేకు చెందిన నిషా భూపేష్ సోనావానే. సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని మా కాన్సులేట్ మృత దేహాలను స్వదేశానికి రప్పించడం కోసం స్థానిక అధికారులతో సమన్వయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..