హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మొయిజ్ హత్యలో అమెరికాకు పరోక్షంగా లింక్ ఉందా..? ఇటీవల జరిగిన ఈ హత్యకు సంబంధించి 26 మంది కొలంబియన్లతో బాటు ఇద్దరు అమెరికన్లను కూడా హైతీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వీరిని 55 ఏళ్ళ జోసెఫ్ విన్సెంట్, 35 ఏళ్ళ జేమ్స్ సోలాజెస్ గా గుర్తించారు. వీరిలో ఒకరు అమెరికన్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ మాజీ ఇన్ఫార్మర్ అని తెలిసింది. కానీ ఈ ఇద్దరిలో ఎవరు ఇన్ఫార్మర్ అన్న విషయాన్ని వెల్లడించేందుకు ఈ సంస్థకు చెందిన ఓ అధికారి నిరాకరించారు. తన పేరు చెప్పడానికి కూడా ఆయన నిరాకరించారు. ఇది చాలా రహస్యం అన్నాడాయన. జొవెనెల్ హత్య తరువాత ఈ ఇన్ఫార్మర్ తిరిగి రాగా హైతీ పోలీసులకు లొంగిపోవాలని ఈ సంస్థ యాజమాన్యం అతడిని కోరిందని అన్నారు. అయితే వీరిద్దరూ ఈ సంస్థ తరఫున మాత్రం పని చేయడం లేదన్నారు.
మరి ఈ మర్డర్ లో వీరి ప్రమేయం ఎందుకు ఉందన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైతీలో నివసించే మూడో అమెరికన్ అయిన క్రిస్టియన్ ఇమాన్యుయెల్ అనే వ్యక్తిని గత ఆదివారం అరెస్టు చేశారు. ఈ దాడికి ఇతడే సూత్రధారి అని హైతీ పోలీసులు చెబుతున్నారు. ఈ దారుణ ఘటనలో హైతీ అమెరికన్లు ఎందుకు పాలు పంచుకున్నారన్న విషయమై అమెరికా అధికారులు, ఇంటెలిజెన్స్ వర్గాలు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి. తమ అధ్యక్షుని హత్య కేసు దర్యాప్తులో తమకు సహకరించాలని హైతీ అధికారులు తమను కోరినట్టు అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. కాగా కొలంబియా కమాండో యూనిట్ కి తాము భాషా అనువాదకులమని, జొవెనెల్ మొయిజ్ ని అరెస్టు చేయాలన్న వారంట్ వారి వద్ద ఉన్నట్టు తమకు తెలిసిందని, కానీ తాము వచ్చేసరికే ఆయన మరణించి ఉన్నాడని ఇద్దరు అమెరికన్లు తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ విద్యార్థులకు కండోమ్స్ కొత్త సెక్స్ ఎడ్యుకేషన్ పాలసీ..సంచలన నిర్ణయం:Condoms To Students Video.