Antarctica: అంటార్కిటికా మంచుపై తొలిసారిగా దిగి చరిత్ర సృష్టించిన ఎయిర్ బస్ ఏ 340 భారీ విమానం..

|

Nov 24, 2021 | 8:17 PM

మొట్టమొదటి సారిగా ఎయిర్‌బస్ A340 విమానం అంటార్కిటికా మంచు మీద ల్యాండ్ అయింది. మంచుతో గడ్డ కట్టుకుని ఉండే ఈ ధ్రువ ప్రాంతంలో ఇంత పెద్ద విమానం ఎప్పుడూ ల్యాండ్ కాలేదు. దీనికోసం రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Antarctica: అంటార్కిటికా మంచుపై తొలిసారిగా దిగి చరిత్ర సృష్టించిన ఎయిర్ బస్ ఏ 340 భారీ విమానం..
Airbus A 340 Landed In Antarcitca
Follow us on

Antarctica: మొట్టమొదటి సారిగా ఎయిర్‌బస్ A340 విమానం అంటార్కిటికా మంచు మీద ల్యాండ్ అయింది. అంటార్కిటికాలో ఎయిర్‌బస్ A-340 ల్యాండ్ అవడానికి సురక్షితమైన భూమిగా మార్చడం ద్వారా పర్యాటక రంగంలో పనిచేస్తున్న కంపెనీల సమూహం చరిత్ర సృష్టించింది. హై ఫ్లై అనే ఏవియేషన్ కంపెనీ ఈ విమాన ఫీట్ సాధించింది. హాయ్ ఫ్లై 801 విమానం నవంబర్ 2 మంగళవారం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ నుండి బయలుదేరి ఐదు గంటల ప్రయాణం తర్వాత అంటార్కిటికాలో ల్యాండ్ అయింది.

అంటార్కిటికాలో, అనేక మీటర్ల ఎత్తులో మంచు పొర ఏడాది పొడవునా దట్టంగా ఉంటుంది. ఈ మంచులో విమానం ల్యాండ్ అవడానికి వీలుగా 3000 అడుగుల పొడవున్న రన్‌వే నిర్మించారు. 290 మంది ప్రయాణికుల సామర్థ్యంతో 223 అడుగుల పొడవైన విమానాన్ని ల్యాండ్ చేయడానికి ముందు 2019 – 2020 మధ్య ఇక్కడ సుమారు 6 ట్రయల్స్ నిర్వహించారు.

అంటార్కిటికాలో ప్రాజెక్టులపై పని చేస్తున్న కంపెనీ

అంటార్కిటికా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రాంతం అని హాయ్ ఫ్లై పేర్కొంది. అందువల్ల, కంపెనీ ఇక్కడ అనేక ఇతర ప్రాజెక్ట్‌లలో పని చేస్తోంది. ఈ సంస్థ వెట్ లీజులో ప్రత్యేకత కలిగి ఉంది.

వోల్ఫ్ గ్యాంగ్ రిసార్ట్‌కు సామాగ్రి..

అంటార్కిటికాలో పనిచేస్తున్న వోల్ఫ్స్ గ్యాంగ్ అనే అడ్వెంచర్ క్యాంప్ ద్వారా ఈ విమానం ప్రారంభించారు. వోల్ఫ్స్ గ్యాంగ్ రిసార్ట్ కోసం అవసరమైన సామాగ్రిని విమానంలో తీసుకువచ్చారు. ఈ విమానాన్ని హాయ్ ఫ్లై వైస్ ప్రెసిడెంట్ అయిన కెప్టెన్ కార్లోస్ మిర్పురి నడిపారు. అంటార్కిటికాలో ఈ బృందం దాదాపు 3 గంటలపాటు గడిపింది. మొత్తం ప్రయాణం 2,500 నాటికల్ మైళ్లు సాగింది.

విమానాశ్రయం లేదు కానీ..

ఆస్ట్రేలియా సైనిక పైలట్, అన్వేషకుడు జార్జ్ హుబర్ట్ విల్కిన్స్ 1928లో మొదటిసారి అంటార్కిటికాకు వెళ్లాడు. లాక్‌హీడ్ వేగా 1 మోనోప్లేన్ ద్వారా వారు అంటార్కిటిక్‌కు చేరుకున్నారు. అంటార్కిటికాలో ఇప్పటివరకు ఏ విమానాశ్రయం నిర్మించలేదు. అయితే, ఇక్కడ 50 ల్యాండింగ్ స్ట్రిప్స్, రన్‌వేలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి: INS Vela: భారత నేవీలోకి నిశ్శబ్ద ఆయుధం ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామి.. మెరుపుదాడితో శత్రువుల పని పట్టేస్తుంది!

OPPO EV: ఒప్పో నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కార్లు.. భారత్‌లో ఈవీలను తీసుకురానున్న మొబైల్ కంపెనీలు!

GDP: పరుగులు తీయనున్న భారత్ జీడీపీ.. ప్రపంచ స్థాయి సంస్థల అంచానా.. ఏ సంస్థ ఎంత అంచనా వేస్తోందంటే..