పాక్‌లో మిన్నంటుతున్న ఆకలి కేకలు..! రేషన్‌ వద్ద తొక్కిసలాట.. ఆరుగురు పిల్లల తండ్రి మృతి..

|

Jan 08, 2023 | 3:53 PM

దాయాది దేశంలో అప్పడే ఆకలి చావులు మొదలయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆహార పదార్ధాల ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా..

పాక్‌లో మిన్నంటుతున్న ఆకలి కేకలు..! రేషన్‌ వద్ద తొక్కిసలాట.. ఆరుగురు పిల్లల తండ్రి మృతి..
Father Of Six Killed In Sta
Follow us on

దాయాది దేశంలో అప్పడే ఆకలి చావులు మొదలయ్యాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆహార పదార్ధాల ధరలు కొండెక్కి కూర్చున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా కేజీ గోదుమ పిండి ధర రూ.150లకు చేరుకుంది. దీంతో సామాన్యులు పొట్టనింపుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే సబ్సీడీ పిండి కోసం యుటిలిటీ స్టోర్‌ల ఎదుట బారులు తీరి లైనుల్లో పడిగాపులుకాస్తున్నారు. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లోని మిర్‌పూర్ ఖాస్‌లోని ఓ ప్రభుత్వ దుకాణంలో పిండి ఇస్తున్నారు. ఐతే అప్పటికే అక్కడ గోదుమ పిండి స్టాక్‌ తక్కువగా ఉండటంతో తమకే ముందుకావాలంటూ దుకాణం ముందు లైనుల్లో ఉన్న వారు పోటీపడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లల తండ్రి (45) తొక్కిసలాటలో మృతి చెందాడు.

మరోవైపు మార్కెట్‌లో సబ్సిడీ పిండి నిల్వలు తగ్గిపోవడంతో పాకిస్థాన్‌లో పిండి ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. పంజాబ్ నుంచి గోధుమల సరఫరా కొరత కారణంగా సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చింది. దాదాపు పాకిస్తాన్ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. లాహోర్‌లో 15 కిలోల పిండి బస్తా రూ.300ల నుంచి ఒక్కసారిగా రూ.2,050లకు చేరుకుంది. 20 కిలోల పిండి 3,000 రూపాయలకు చేరుకోవడంతో పిండి ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టాయి. ఆ దేశంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.