ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌కు బదులు ఏం ధరించాడో చూడండి.. అతనిపై కోపంతో రగిలిపోయి విమానం దింపేసిన అధికారులు

|

Dec 18, 2021 | 6:01 PM

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అయిపోయింది. కరోనా నుంచి రక్షించుకునేందుకు భౌతిక దూరంతో పాటు మాస్క్‌ తప్పనిసరి...

ప్రయాణికుడు ముఖానికి మాస్క్‌కు బదులు ఏం ధరించాడో చూడండి.. అతనిపై కోపంతో రగిలిపోయి విమానం దింపేసిన అధికారులు
Follow us on

కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించడం తప్పనిసరి అయిపోయింది. కరోనా నుంచి రక్షించుకునేందుకు భౌతిక దూరంతో పాటు మాస్క్‌ తప్పనిసరి. అయితే కొందరు మాస్క్‌ ధరించకుండా అనవసరమైన రాద్ధాంతం చేస్తుంటారు. ఎంత చెప్పిన అర్థం కాదు. చివరికి ఇబ్బందుల్లో పడిపోతుంటారు. ఫేస్‌కు పెట్టుకోకూడదని మాస్క్‌ పెట్టుకోవడం కంటే మాస్క్‌ లేకుండా ఉండటమే మంచిదేమో. విమానంలో ఓ ప్రయాణికుడు మహిళలు ధరించే అండర్‌వేర్‌ను ఫేస్‌కు మాస్క్‌గా పెట్టుకోవడమే అతనికి శాపంగా మారింది. ఇలా చేసినందుకు అతన్ని విమానం నుంచి దింపేశారు. అంతేకాదు అతను లైఫ్‌లాంగ్‌ విమానం ఎక్కకుండా నిషేధం విధించారు అధికారులు. ఈ ఘటన ఫ్లోరిడాలో బుధవారం చోటు చేసుకుంది. యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం ఎక్కిన ఆడమ్‌ జెన్నే (38) అనే ప్రయాణికుడు తన సీటులో యధేచ్ఛగా కూర్చున్నాడు.

కానీ అతని మాస్క్‌ను చూసి విమానంలో ఉన్న తోటి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే విమాన సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే విమాన సిబ్బంది వచ్చి ఏంటి ఆ మాస్క్‌ అసలైన మాస్క్‌ పెట్టుకోమంటే మహిళల అండర్‌వేర్‌ను ధరించావేంటి అని ప్రశ్నించగా, ఏం కాదు లే అని బదులిచ్చాడు ఆ ప్రయాణికుడు. పైగా ఇది వరకు కూడా చాలా విమానాల్లో అండర్‌వేర్‌ పెట్టుకున్నానని చెప్పుకొచ్చాడు. దీంతో విమాన సిబ్బంది కోపంత రగిలిపోయి సంస్థ అధికారులకు సమాచారం అందించారు.

అప్పటికే ఫోర్ట్‌ లాడెడాల్‌ ఎయిర్‌ఫోర్టులో విమానం ఇంకా బయలుదేరలేదు. అతని దగ్గరకు వచ్చిన అధికారులు సరైన మాస్క్‌ పెట్టుకుంటావా.. విమానం దిగిపోతావా అని అడిగారు. దీంతో ఆ ప్రయాణికుడు అధికారులకే ఎదురు ప్రశ్నలు వేశాడు. మీరు మమ్మల్ని మాస్క్‌ పెట్టుకోవడం తప్పనిసరి అని చెబుతారు.. విమానం గాల్లో ఎగిరిన తర్వాత సరఫరా చేసిన ఆహారాన్ని తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం మాస్క్‌ అవసరం లేదని అంటున్నారు.. ఇదే విధానం.. ఈ విషయాన్ని చెప్పడానికే నేను ఇలా చేశాను అంటూ చెప్పాడు. కానీ విమాన ప్రయాణికులకు అతను చెప్పింది ఏ మాత్రం అర్థం కాకపోవడంతో అతన్ని వెంటనే విమానం నుంచి దింపేశారు. అంతేకాదు.. జీవితంలో తమ సంస్థ విమానాలు ఎక్కకుండ నిషేధం విధించారు.

చూశారుగా.. మాస్క్‌ విషయంలో ఇలాంటి రాద్ధాంతం చేస్తే ఇలాంటి చర్యలే ఉంటాయని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా తగ్గిపోకముందు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసేందుకు రెడీ అవుతోంది. సో.. విమానంలోనైనా.. రైళ్లోనైనా.. బయటకు వెళ్లేటప్పుడైనా.. మాస్క్‌లు ధరించడం ఎంతో మంచిది. మాస్క్‌ ధరించడం వల్ల మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. మాస్క్ అనేది మన ఆరోగ్యం కోసమని భావించాలి తప్ప.. ఇలా ప్రవర్తిస్తే ఎన్నో ఇబ్బందులు ఎదర్కొవాల్సిన పరిస్థితి వస్తుంది.

ఇవి కూడా చదవండి:

Delhi Schools: పాఠశాలలపై ఢిల్లీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Omicron: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఒమిక్రాన్ కలకలం.. 11 రాష్ట్రాకు పాకిన వైరస్.. ఇవాళ కొత్త కరోనా కేసులు ఎన్నంటే?