RUSSIAN FLIGHT RADAR: వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయంతో రష్యన్లు పరేషాన్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు..

|

Sep 23, 2022 | 4:07 PM

ఉక్రెయిన్ తో యుద్ధం వేళ ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తింటున్న రష్యా కీలక నిర్ణయాలు తీసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ చేసిన ప్రకటన..

RUSSIAN FLIGHT RADAR: వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయంతో రష్యన్లు పరేషాన్.. పెరిగిన విమాన టికెట్ల ధరలు..
Flight Radar
Follow us on

RUSSIAN FLIGHT RADAR: ఉక్రెయిన్ తో యుద్ధం వేళ ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తింటున్న రష్యా కీలక నిర్ణయాలు తీసుకుంటుండం ఆందోళన కలిగిస్తోంది. దాదాపు మూడు లక్షల మందితో పాక్షిక సైనిక సమీకరణ చేపడుతున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ చేసిన ప్రకటన రష్యన్లను విస్మయానికి గురిచేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో పశ్చిమ దేశాలను ఎదుర్కొనేందుకు, తమ భూభాగాలను కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పుతిన్ తెలిపారు. సైనిక సమీకరణకు సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వుపై కూడా ఆయన సంతకాలు చేసిన వెంటనే రష్యా నుంచి ఇతర దేశాలకు వెళ్లిపోవడానికి పెద్ద ఎత్తున పౌరులు విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు. దీంతో విమాన టికెట్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఎక్కువమంది రష్యానుంచి పక్కనే ఉన్న ఆర్మేనియా, జార్జియా, అబర్ బైజాన్, కజకిస్తాన్ వంటి దేశాలకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారు. అంతే కాదు ‘HOW TO LEAVE RUSSIA’ అన్న గుగుల్ సెర్చింగ్ కూడా ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతోందట. దీనంతటికీ రీజన్ ఒకటే. అదే రష్యా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం. ఉక్రెయిన్ యుద్ధంలో పనిచేయడానికి 3 లక్షల మంది పాక్షిక సైనికులను సమీకరిస్తున్నారు. ముప్పై ఐదేళ్ల లోపు యువకులను సైన్యంలోకి తీసుకుంటున్నారు. దీంతో గుబులు రేగిన రష్యన్లు పెట్టా- బేడా సర్దుకుని పొరుగు దేశాలకు ఉడాయిస్తున్నారు.

కొన్నాళ్ల పాటు రష్యన్ ఆర్మీలో పని చేసిన.. ప్రస్తుతం రిజర్వ్ గా ఉంచిన వారిని కూడా.. ఈ సైనిక సమీకరణలో తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు రిజర్విస్టులకు నోటీసులు కూడా పంపారట. వీరిని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్న ఆదేశాలు అందాయట. దీంతో వీరి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారంతా కలసి దేశం విడిచేందుకు ప్రయత్నిస్తున్నారట. పొరుగుదేశాలకు వెళ్లే.. ఈ ఫ్లైట్స్ తాలూకూ టికెట్లు క్షణాల్లో అమ్ముడై పోతున్నాయి. 18- 65 ఏళ్ల మధ్యగల పురుషులకు విమాన టికెట్లను అమ్మడం లేదని చెబుతున్నాయి విమాన సర్వీసులు. ఎందుకంటే తమపై మార్షల్ లా ప్రయోగిస్తారేమో అన్న భయం వీరిని వెంటాడుతోంది. అందుకే రష్యా డిఫెన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఉన్నవారికే విమాన టికెట్లు విక్రయిస్తున్నారు. కేవలం సాధారణ పౌరులు మాత్రమే కాదు.. ఖైదీలను కూడా యుద్ధ విధుల్లోకి తీసుకోవాలని చూస్తోంది రష్యన్ రక్షణ శాఖ. వాగ్నర్ గ్రూప్ అధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. వీరిని కూడా సైన్యంలోకి తీసుకున్నాక.. ఉక్రెయిన్ యుద్ధానికి పంపనుట్టు సమాచారం. మొత్తం మీద పుతిన్ నిర్ణయంతో రష్యన్ ప్రజలు పరేషాన్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..