Cancer: వైద్య చరిత్రలో సువర్ణ అధ్యాయం.. ఆ మందుతో క్యాన్సర్ ఖతం.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..

|

Jun 07, 2022 | 6:51 PM

న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. పురీష నాళ క్యాన్సర్‌ (మలద్వార కాన్సర్) తో బాధపడుతున్న 18 మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు

Cancer: వైద్య చరిత్రలో సువర్ణ అధ్యాయం.. ఆ మందుతో క్యాన్సర్ ఖతం.. తాజా పరిశోధనలో సంచలన విషయాలు..
Cancer
Follow us on

Cancer Drug Trial: ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ ప్రాణాంతక కాన్సర్‌లో పలు రకాలున్నాయి. అయితే.. శరీరంలో ఏ అవయవాన్నైనా నాశనం చేసే ఈ కాన్సర్ నియంత్రణకు ఇంకా ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఔషధాల ప్రకారం.. క్యాన్సర్ ను ఓ దశ వరకు మాత్రమే నయం చేసే వీలుంటుంది. ఈ క్రమంలో తాజాగా జరిపిన అధ్యయనంలో పలు కీలక విషయాలు వెలుగులోకి రావడంతోపాటు కొత్త ఆశలు రేకిస్తున్నాయి. న్యూయార్క్‌లోని స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు తాజాగా నిర్వహించిన డ్రగ్ ట్రయల్స్ క్యాన్సర్ రోగుల్లో కొత్త ఆశలు రేపుతున్నాయి. పురీష నాళ క్యాన్సర్‌ (మలద్వార కాన్సర్) తో బాధపడుతున్న 18 మందిపై స్లోవన్ కెట్టరింగ్ క్యాన్సర్ సెంటర్ పరిశోధకులు.. డోస్టార్లిమాబ్ అనే ఔషధాన్ని ప్రయోగించారు. ఈ ఔషధం ప్రయోగాలతో క్యాన్సర్‌కు చెక్ పెట్టడంతోపాటు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రోగులందరికీ.. ఆర్నెల్ల పాటు ఈ ఔషధాన్ని ఇవ్వగా.. ట్రయల్స్ ముగిసేసరికి వారిందరిలో క్యాన్సర్ కణజాలం అదృశ్యమైనట్లు తెలిపారు. ఆ రోగులు గతంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్, శస్త్రచికిత్సలతో తీవ్ర శారీరక వేదనను అనుభవించినట్లు నివేదికలో వెల్లడించారు. వారిలో కొందరికి తీవ్రస్థాయిలో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి వారందరిపై డోస్టార్లిమాబ్ ఔషధం ప్రయోగించగా ఆర్నెల్ల తర్వాత ఏ ఒక్కరిలోనూ క్యాన్సర్ కనిపించలేదని తెలిపారు. తదుపరి చికిత్సలు అవసరంలేని రీతిలో వారంతా సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకున్నట్లు పేర్కొన్నారు.

దోస్టార్‌లిమాబ్ ఔషధంలో ల్యాబ్‌లో రూపొందించిన అణువులు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోకి ప్రవేశించిన అనంతరం యాంటీబాడీలుగా వృద్ధి చెందుతూ.. క్యాన్సర్ కణాలను అంతరించిపోయేలా చేసినట్లు తెలిపారు. ఈ ఔషధం వాడిన తర్వాత ఆ 18 మంది రోగులకు ఎండోస్కోపీ, పీఈటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహించినట్లు తెలిపారు. అన్ని పరీక్షల్లోనూ క్యాన్సర్ లేదనే ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. ఇది క్యాన్సర్ చరిత్రలో అద్భుత పరిణామం అంటూ.. ఈ ట్రయల్స్ లో పాలుపంచుకున్న న్యూయార్క్ మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్‌కు చెందిన డాక్టర్ లూయిస్ ఏ డియాజ్ అభివర్ణించారు. ఓ ఔషధంతో క్యాన్సర్ మటుమాయం కావడం ఇదే తొలిసారి అంటూ వివరించారు.

దోస్టార్‌లిమాబ్‌ను తీసుకున్న తర్వాత వారి క్యాన్సర్ ఒకే దశలో ఉందని.. ఇది స్థానికంగా పురీషనాళంలో అభివృద్ధి చెందింది కానీ ఇతర అవయవాలకు వ్యాపించలేదని అధ్యయనం రిపోర్టులో తెలిపారు. కాగా.. ఈ చికిత్స ఆశాజనకంగా కనిపిస్తోంది. అయితే ఇది ఎక్కువ మంది రోగులకు పని చేస్తుందో లేదో..? అనే విషయంతోపాటు క్యాన్సర్‌ నుంచి ఉపశమనం కోసం పెద్ద ఎత్తున ట్రయల్స్ నిర్వహించాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా.. ఈ ఫలితాలు ఇప్పుడు వైద్య ప్రపంచంలో సంచలనం రేపుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కొలొరెక్టల్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ అలాన్ పి. వేనూక్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్క రోగిలో పూర్తి ఉపశమనం అనేది ఇప్పటివరకు వినలేదని అన్నారు. బహుశా ప్రపంచంలో ఇది మొదటి పరిశోధన అని కొనియాడారు. మెమోరియల్ స్లోన్ కెట్టెరింగ్ క్యాన్సర్ సెంటర్, ఆంకాలజిస్ట్ డాక్టర్ ఆండ్రియా సెర్సెక్ రోగులు క్యాన్సర్ రహితంగా మారరన్న విషయాన్ని క్షుణ్ణంగా వివరించారు. చాలా సంతోషకరమైన వార్త అంటూ ఆమె న్యూయార్క్ టైమ్స్‌తో పేర్కొన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..