Pfizer: కోవిడ్ వ్యాక్సిన్ అసలు డేటా లీక్.. ఆ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేశారా..? నిజం ఏంటంటే..?

|

May 10, 2022 | 12:27 PM

కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించిన కీలక డేటా లీక్ కావడంతో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ ఫార్మ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను అరెస్టు చేసినట్లు ప్రపంచ వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Pfizer: కోవిడ్ వ్యాక్సిన్ అసలు డేటా లీక్.. ఆ ఫార్మా కంపెనీ వైస్ ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేశారా..? నిజం ఏంటంటే..?
Covid Vaccine
Follow us on

Pfizer Covid-19 vaccine: కరోనావైరస్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కోవిడ్ వ్యాక్సిన్ల డోసులను ఇప్పటికే కోట్లాది మంది తీసుకున్నారు. ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరుకు సంబంధించిన కీలక డేటా లీక్ కావడంతో అమెరికాకు చెందిన ఓ దిగ్గజ ఫార్మ సంస్థ వైస్ ప్రెసిడెంట్‌ను అరెస్టు చేసినట్లు ప్రపంచ వ్యాప్తంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కోవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించిన కీలక పత్రాలు విడుదలైన నేపథ్యంలో ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్‌ని అరెస్టు చేసినట్లు ఒక కథనం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అయితే.. అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్‌ అరెస్ట్‌ బూటకమని తేలింది. వాస్తవానికి రాడీ జాన్సన్‌ను అరెస్టు చేయలేదు. మోసం లేదా మరే ఇతర నేరం కింద ఆయనపై అభియోగాలు మోపలేదు. అంతర్జాతీయ మీడియా ఈ సంఘటనను నివేదించలేదు. ఇది ఫేక్ న్యూస్ అని కంపెనీ ప్రకటించింది.

అయితే.. వాంకోవర్ టైమ్స్ అనే వ్యంగ్య వెబ్‌సైట్‌.. ఈ కథనాన్ని ప్రచురించింది. COVID-19 మహమ్మారి తర్వాత టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుంచి Pfizer సంస్థపై తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తోంది. దాని CEO ఆల్బర్ట్ బౌర్లా .. కోవిడ్ వ్యాక్సిన్ల పనితీరు సరిగా లేదని.. దానికి సంబంధించిన డేటీ లీక్ అయిందని.. అందుకే ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ రాడీ జాన్సన్‌ని అరెస్టు చేశారంటూ తప్పుడు వార్తను ప్రచురించినట్లు కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన కథనం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న నేపథ్యంతో ఫైజర్ కంపెనీ ఈ ప్రకటన చేసింది.

Pfizer

Also Read:

ఇవి కూడా చదవండి

Pulitzer Award: దివంగత జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీకి పులిట్జర్ అవార్డు.. లిస్టులో మరో ముగ్గురు భారతీయులు..