అరుదైన అల్బినో కంగారూల హల్‌చల్‌.. చూసి మురిసిపోతున్న నెటిజన్లు.. ఎక్కడున్నాయంటే..

|

Mar 11, 2023 | 6:20 PM

అల్బినిజం అనేది ఒక జంతువు, మొక్కలలో పుట్టుకతో మెలనిన్ లేకపోవడం, ఫలితంగా తెల్ల జుట్టు, తెల్లటి చర్మం, నీలి కంటి రంగు వస్తుంది. ఈ పరిస్థితి జంతువులలో చాలా అరుదుగా కనిపిస్తుంది.

అరుదైన అల్బినో కంగారూల హల్‌చల్‌.. చూసి మురిసిపోతున్న నెటిజన్లు.. ఎక్కడున్నాయంటే..
White Kangaroos
Follow us on

కంగారూల నేలగా పేరొందిన ఆస్ట్రేలియాలో చాలా అరుదైన తెల్లటి (అల్బినో) కంగారూలు ప్రత్యక్షమయ్యాయి. ఆస్ట్రేలియాలోని మార్నింగ్‌టన్ ద్వీపకల్పంలో ఉన్న ప్రైవేట్ వన్యప్రాణుల అభయారణ్యం పనోరమా అభయారణ్యం తన ఫేస్‌బుక్ పేజీలో తెల్ల కంగారూల గుంపు ఫోటోను షేర్ చేసింది. అల్బినో కంగారూల ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోకు వందల కొద్దీ లైక్‌లు, కామెంట్స్‌ వచ్చాయి. ఈ అరుదైన అల్బినో కంగారూలను ప్రత్యక్షంగా చూడాలని నెటిజన్లు తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

అల్బినో కంగారూల గురించి పనోరమా రిజర్వ్ యజమాని మాట్లాడుతూ,..2012 లో దక్షిణ ఆస్ట్రేలియా నుండి మూడు అరుదైన అల్బినో (తెలుపు) కంగారూలను రక్షించి ఇక్కడ సంరక్షిస్తున్నట్టుగా చెప్పారు. ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్‌లో మొత్తం తొమ్మిది తెల్ల కంగారూలు స్వేచ్ఛగా జీవిస్తున్నాయని ఆయన వివరించారు.

అరుదైన అల్బినో కంగారూలతో పాటు, దాదాపు 55 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న అభయారణ్యం అనేక ఇతర అడవి జంతువులకు నిలయంగా ఉంది. వీటిలో చిన్న మేకలు, వాలబీస్, అల్బాకాస్, ఈముస్, ఆవులు, బాతులు, నెమళ్ళు, చిలుకలు ఉన్నాయి. ఈ జంతువులు అడవిలో పెరగడానికి, జీవించడానికి సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

అల్బినిజం అంటే ఏమిటి: అల్బినిజం అనేది ఒక జంతువు, మొక్కలలో పుట్టుకతో మెలనిన్ లేకపోవడం, ఫలితంగా తెల్ల జుట్టు, తెల్లటి చర్మం, నీలి కంటి రంగు వస్తుంది. ఈ పరిస్థితి జంతువులలో చాలా అరుదుగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంగారూలలో, ఆల్బినిజం, లూసిజంతో జన్మించే అవకాశం 50,000 కంగారూలలో ఒకటి మాత్రమే ఇలా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం