సోషల్ మీడియాలో పాలోవర్స్ను పెంచుకోవడానికి రకారకాల పనులు చేస్తుంటారు కొందరు. కొన్ని సార్లు వారు చేసే పనులు పక్కవారికి, చూసేవారికి ఇబ్బందిగా ఉంటాయి. వారు చేసేవి నిజమో అబద్ధమో కూడా తెలియదు. ఓ వ్యక్తి రైలు పట్టాలకు కట్టేసిన కుక్కను ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారు అతడిని ప్రశంసించారు. కానీ నిపుణులు ఆ వీడియో చూసిన తర్వాత..
వీడియోలో ఏముంది..?
రైలు పట్టాలకు ఓ కుక్కను కట్టేశారు. అప్పుడే ఓ రైలు వస్తుంది. అది చూసిన వ్యక్తి పరుగెత్తి కుక్కను విడిపించి దానిని రక్షిస్తాడు. ఈ సమయంలో రైలు హారన్ మోగుతోంది, బ్యాక్‌గ్రౌండ్‌లోని వ్యక్తులు ఆ వ్యక్తిని చేయవద్దని వేడుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఈ 16-సెకన్ల వీడియోను టిక్ టాక్‌లో పోస్ట్ చేసిన తర్వాత, ప్రజలు ఆ వ్యక్తిని లెజెండ్ అని పిలవడం ప్రారంభించారు. ఇది సైట్ యొక్క కమ్యూనిటీ మార్గదర్శకాలను ఉల్లంఘించిందని వీడియో టిక్‌టాక్ యూజర్ ఖాతా నుండి తీసివేశారు. అయితే ఈ వీడియోపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు. నిపుణులు ఈ వీడియో పరిశీలించి నకిలీదని నిర్ధారించారు. ఆ వ్యక్తి మొదట కుక్కను రక్షించినట్లు చిత్రీకరించినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు తర్వాత రైలు వస్తున్నట్లు ఎడిటింగ్ చేశారని వివరిస్తున్నారు. ముందుగా రైలు నీడ కొంచెం దూరంగా ఉందని. ఇది మనిషి, కుక్కను దాటినప్పుడు, మనిషి నీడలో ఉన్నప్పటికీ అతని కింద ఒక చిన్న నీడ ఉందని చెప్పారు. నీడలు కూడా అస్పష్టంగా ఉన్నాయన్నారు.
మొదట వీడియో ఆకట్టుకునేలా కనిపించినప్పటికీ, ఆ వ్యక్తి తాను చేయని పనికి చాలా ప్రశంసలు అందుకున్నాడని చెప్పారు. రైలు పట్టాలపై కుక్క కట్టేసి ఉండడం బాధకరమైన అంశమే.. దీనిని తేలికగా తీసుకోకూడదని.. కానీ కొంతమంది సోషల్ మీడియా పాలోవర్స్ను పెంచుకోవడం ఇలాంటి చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
Read Also.. E Scooter: మొన్న హైదరాబాద్.. నేడు యూకే. ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎందుకు కాలిపోతున్నాయి.. లోపం ఎక్కడ.?