TANA: ప్రతి రూపాయి తిరిగి రాబడతాం.. రూ.30కోట్ల స్కామ్‌పై తానా కీలక ప్రకటన

|

Nov 29, 2024 | 10:28 PM

'తెలుగు అసోసియేషన్ ఆఫ్‌ నార్త్‌ అమెరికా-తానా'. లక్ష్యం-ఆశయం-ఉద్దేశం గొప్పవే అయినా.. ఘనమైన కీర్తి ఉన్నా.. ఇప్పుడు 'తానా' అంటే అర్థం మారుతోంది. 'తానా ఫౌండేషన్‌'లో రూ.30 కోట్ల రూపాయల స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది.

TANA: ప్రతి రూపాయి తిరిగి రాబడతాం.. రూ.30కోట్ల స్కామ్‌పై తానా కీలక ప్రకటన
Every Penny Will Be Recovered Soon, Tana Board Key Comments On Ex Treasurer Srikanth Scam
Follow us on

అమెరికాలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా TANA (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ స్కామ్‌) ఫౌండేషన్ స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది. ఫౌండేషన్‌ పేరుతో పెద్దలు 30 కోట్లు కొట్టేసిన ఘటనపై లోతుగా దర్యాప్తు జరుగుతోంది.. శ్రీకాంత్ పోలవరపు అనే కోశాధికారి, విరాళాలుగా వచ్చిన సొమ్మును తన సొంత కంపెనీకి మళ్లించుకున్నాడు. రెండేళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు వెలుగుచూడడంతో మొత్తం తానా వ్యవస్థే అవాక్కయ్యింది. ఈ స్కామ్ పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఈ తరుణంలో ఈ స్కామ్ పై TANA – తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఫౌండేషన్ తాజాగా స్పందించింది.. దోచుకున్న ప్రతీ రూపాయిని వసూలు చేస్తామని ప్రకటించింది.

తెలుగు నేల ‘పుట్టినిల్లు’.. తెలుగు జాతికి ఉత్తర అమెరికా ‘మెట్టినిల్లు’.. అని అంటుంటారు ప్రవాస తెలుగువారు. ఈ అభిమానం ఎంతలా చొచ్చుకెళ్లిందంటే.. ఇదీ మనదేశమే అని ఓన్‌ చేసుకునేంతలా. ఎంతైనా దేశం కాని దేశమేగా అది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా ఇబ్బందొస్తే చేదోడు వాదోడుగా ఉండేదెవరు? అనుకోని పరిస్థితుల్లో చనిపోతే.. ఆఖరి చూపుకు నోచుకోనంత కష్టం వస్తే.. సాయం చేసేదెవరు? అమెరికాలో తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను కాపాడేదెవరు? తెలుగు భాషను పరిరక్షించేవాళ్లెవరు? వీటన్నిటికీ సమాధానం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్‌ నార్త్‌ అమెరికా-తానా’. లక్ష్యం-ఆశయం-ఉద్దేశం గొప్పవే అయినా.. ఘనమైన కీర్తి ఉన్నా.. ఇప్పుడు ‘తానా’ అంటే అర్థం మారుతోంది. ‘తానా ఫౌండేషన్‌’లో రూ.30 కోట్ల రూపాయల స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది.

అమెరికాలో మాత్రమే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా TANA ఫౌండేషన్ స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది. ఫౌండేషన్‌ పేరుతో పెద్దలు 30 కోట్లు కొట్టేసిన వైనంపై లోతుగా దర్యాప్తు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. శ్రీకాంత్ పోలవరపు అనే కోశాధికారి, విరాళాలుగా వచ్చిన సొమ్మును తన సొంత కంపెనీకి మళ్లించుకున్నాడు. రెండేళ్ల పాటు విచ్చలవిడిగా జరిగిన ఈ స్కామ్ ఇప్పుడు వెలుగుచూడడంతో మొత్తం తానా వ్యవస్థే అవాక్కయ్యింది. సోమవారం సర్వసభ్య సమావేశం పెడితే.. తిరిగి ఇచ్చేస్తా, వదిలేయండి అంటూ శ్రీకాంత్‌ పోలవరపు ఒకమాట చెప్పి ఆఫ్‌లైన్ అయిపోయాడు. అంతేకాదు.. ఉన్నపళంగా లక్షడాలర్లు తానా అకౌంట్‌కి రివర్స్ పంపేశాడు. మిగతాదీ డిసెంబర్‌ చివరి నాటికి ఇచ్చేస్తానని ప్రాధేయపడ్డాడు. కానీ కుదరదు.. ! అతనికి నోటీసులు, ఫైనాన్షియల్ ఫ్రాడ్‌కి సంబంధించిన సెక్షన్లు అప్లై చెయ్యాలని తానా సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి