AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox: మంకీపాక్స్ కు వ్యతిరేకంగా మంకీపాక్స్ వ్యాక్సిన్.. వినియోగానికి ఈయూ ఆమోదం

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను (Monkeypox) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే మశూచి వ్యాక్సిన్‌ను యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. ఈయూ ఔషధాల సిఫారసుకు అనుగుణంగా ఐరోపా...

Monkeypox: మంకీపాక్స్ కు వ్యతిరేకంగా మంకీపాక్స్ వ్యాక్సిన్.. వినియోగానికి ఈయూ ఆమోదం
Smallpox Vaccine
Ganesh Mudavath
|

Updated on: Jul 25, 2022 | 9:49 PM

Share

ప్రపంచ ఆరోగ్య సంస్థ మంకీపాక్స్‌ను (Monkeypox) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన తర్వాత మంకీపాక్స్‌కు వ్యతిరేకంగా ఉపయోగించే మశూచి వ్యాక్సిన్‌ను యూరోపియన్ కమిషన్ ఆమోదించింది. ఈయూ ఔషధాల సిఫారసుకు అనుగుణంగా ఐరోపా కమీషన్ కంపెనీ మశూచి వ్యాక్సిన్ ఇమ్వానెక్స్‌కు మంకీపాక్స్ నుంచి రక్షణ కలిగించడానికి మార్కెటింగ్ అధికారాన్ని పొడిగించిందని ఓ ప్రకటనలో వెల్లడైంది. అన్ని యూరోపియన్ సభ్య దేశాలతో పాటు ఐస్‌లాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్, నార్వేలోనూ చెల్లుబాటు అవుతుంది. మశూచి (Smallpox) నివారణ కోసం 2013 నుంచి ఈయూలో Imvanex ను ఆమోదించారు. మంకీపాక్స్ వైరస్, మశూచి వైరస్ మధ్య సారూప్యత ఉన్నందున ఇది మంకీపాక్స్‌ను నివారిస్తుందని గుర్తించబడింది. కాగా.. 1980లోని మశూచి కంటే ప్రస్తుతం వెలుగుచూస్తున్న మంకీపాక్స్ తక్కువ ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్నునొప్పి, దద్దుర్లు, ముఖంపై, అరచేతులు, అరికాళ్లపై కనిపిస్తాయి మచ్చలు వస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గతంలో వైరస్ వ్యాప్తి దాని గుర్తింపును కష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జపాన్ లో నిల్వ ఉంచిన మశూచి వ్యాక్సిన్‌లను మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చికిత్స చేయడానికి ఉపయోగించవచ్చా అని జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశం కానుంది. వైరస్ ఏజెంట్‌తో సాధ్యమయ్యే దాడులకు ప్రతిస్పందించడానికి ఆ దేశంలో టీకాలు ఉన్నాయని ఆరోగ్య మంత్రి షిగేయుకి గోటో మేలోనే చెప్పడం విశేషం.

ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్‌ను గ్లోబల్‌ హెల్త్‌ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌కు నిపుణుల కమిటీ సూచించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమై, సమన్వయంగా స్పందిస్తూ వ్యాధిపై పోరాడాతాయని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2005లో తీసుకొచ్చిన నిబంధనల ప్రకారం అన్ని దేశాలు హెల్త్‌ ఎమర్జెన్సీపై కచ్చితంగా తక్షణమే స్పందించడం చట్టపరమైన కర్తవ్యం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..