Canada Protest: కెనడాలో ఆందోళనలు ఉధృతం.. చేతులెత్తిసిన పోలీసులు.. అట్టావాలో ఎమర్జెన్సీ

Emergency In Canada: కెనడాలో నిరసనకారుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కొవిడ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న నిరసనలతో అట్టావాలో ఎమర్జెన్సీ విధించారు. దేశంలో కోవిడ్‌-19 (Coronavirus) ఆంక్షలను వ్యతిరేకిస్తూ..

Canada Protest: కెనడాలో ఆందోళనలు ఉధృతం.. చేతులెత్తిసిన పోలీసులు.. అట్టావాలో ఎమర్జెన్సీ
Canada
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 09, 2022 | 5:49 AM

Emergency In Canada: కెనడాలో నిరసనకారుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. కొవిడ్‌ ఆంక్షలను వ్యతిరేకిస్తూ కొనసాగుతున్న నిరసనలతో అట్టావాలో ఎమర్జెన్సీ విధించారు. దేశంలో కోవిడ్‌-19 (Coronavirus) ఆంక్షలను వ్యతిరేకిస్తూ నిరసనకారులు వందలాది ట్రక్కులతో ఆందోళన చేస్తున్నారు. గత 10రోజులుగా రాజధాని అట్టావా, టొరంటో, ఒంటారియాతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. వందలాదిమంది నిరసనకారులు ట్రక్కులతో రాజధాని అట్టావాను చుట్టిముట్టి ఆందోళనలు (Canada Protest) కొనసాగిస్తున్నారు. నగర రోడ్లపైనే తిష్ఠవేసి నిరసనలు ఉధృతం చేశారు. ఇక అట్టావాలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తాజాగా ఎమర్జెన్సీ విధించారు నగర మేయర్. పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతోనే ఎమర్జెన్సీ (Ottawa) నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మేయర్. 10 రోజులుగా కొనసాగుతోన్న నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉండడంతో ప్రధాని జస్టిన్‌ ట్రూడో కుటుంబం ఇప్పటికే రహస్య ప్రాంతంలోకి వెళ్లిపోయింది.

దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు వ్యాక్సిన్ ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రధాని జస్టిన్‌ ట్రూడో ప్రభుత్వం. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తోపాటు పలు కొవిడ్‌ ఆంక్షలను కఠినతరం చేసింది ట్రోడో గవర్నమెంట్. ముఖ్యంగా వ్యాక్సిన్లు తీసుకోని ట్రక్కు డ్రైవర్లను దేశంలోకి అనుమతించేదే లేదని ప్రకటిచింది. ఆందోళనలు ఉద్ధృతమవుతున్నా కొవిడ్‌ ఆంక్షలు, వ్యాక్సిన్‌పై వెనక్కి తగ్గేదేలేదని ప్రకటించింది ట్రూడో ప్రభుత్వం. దీంతో అసలు రచ్చ ఇక్కడ మొదలైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతూ ట్రక్కు డ్రైవర్లు రాజధాని అట్టావాను ముట్టడించారు. ‘ఫ్రీడం కాన్వాయ్‌’ పేరుతో నగరంలోకి ప్రవేశించారు. రోడ్లపైనే ట్రక్కులను అడ్డంగా ఆపి.. తాత్కాలిక టెంట్లు ఏర్పాటుచేసి గత పదిరోజులుగా ట్రక్కుల హార్న్‌లు మోగిస్తూ, బాణాసంచా కాలుస్తూ నగరాన్ని శబ్దాలతో హోరెత్తిస్తున్నారు.

ఆందోళనలు అదుపులోకి రాకపోగా.. పోలీసుల కంటే నిరసనకారులే భారీ సంఖ్యలో చేరుకోవడంతో అధికారులు చేతులెత్తేశారు. దీంతో చేసేందేంలేక చివరకు అట్టావాలో ఎమర్జెన్సీ ప్రకటించారు నగర మేయర్ జిమ్‌ వాట్సన్‌. ట్రక్కు డ్రైవర్లు చేస్తోన్న ఆందోళనలపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లు, ఇతర వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక నుంచి ట్రక్కులు నగరంలోకి రాకుండా ఉండేందుకు ఎక్కడికక్కడ బారీకేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆందోళనలు విరమించేందుకు మధ్యవర్తుల ద్వారా నిరసనకారులతో చర్చలు జరిపేందుకు ప్రయత్నింస్తుంది ట్రూడో ప్రభుత్వం.

Also Read:

Dowry to Girls: అక్కడ పెళ్లి కావాలంటే అబ్బాయిలు ఎదురుకట్నం ఇవ్వాల్సిందే.. ఇంకో క్రేజీ రూల్ కూడా ఉంది

Indian Army: విషాదం.. హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి.. ధ్రువీకరించిన ఆర్మీ