Elon Musk : ఒక్క క్షణం చాలు జీవితంలో ఏమైనా జరగవచ్చు.. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లవుతాయి అనే సామెతను నిజం చేస్తుంటారు ఎలాన్ మస్క్. స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీ అధినేత ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిలో ఒకరు ఎలాన్ మస్క్. ఈయన తన ట్విట్స్ తో నష్టాలను కోరి కొనితెచ్చుకుంటాడు.. ఇప్పటికే అనేకసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేల కోట్లు పోగొట్టుకున్న ఎలాన్ తాజాగా మరో ట్విట్ చేశాడు.. తద్వారా అమెరికా మార్కెట్లో టెస్లా ఈక్విటీ విలువ ఏకంగా 8.6 శాతం పడిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ నికర ఆస్తి విలువ రూ. 1.10 లక్షల కోట్లకు చేరుకుంది.
ఇటీవల బిట్ కాయిన్ విలువ పెరుగుతుండడంపై ట్విట్టర్ లో ఎలాన్ బిట్ కాయిన్ షేర్స్ ధరపై స్పందించారు. బిట్ కాయిన్, ఎథర్ క్రిప్టో కరెన్సీ ధర ఎక్కువగా కనిపిస్తోందని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కాగా, టెస్లా ఈక్విటీ వాటాలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు క్యూ కట్టారు. దీంతో సంస్థ ఈక్విటీ విలువ పడిపోయింది. త్వరలో బిట్ కాయిన్ పేమెంట్ సేవలను ప్రారంభించాలని భావిస్తున్న ఎలాన్ 1.5 బిలియన్ డాలర్ల విలువైన కాయిన్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: