క్రొయేషియాపై పగబట్టిన ప్రకృతి.. ఇటు లాక్‌డౌన్.. అటు భూకంపం..

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడ కనికరించడం లేదు. మొన్న గ్రీస్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. క్రోయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటకే అక్కడ కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఆదివారం భూకంపం రావడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రిక్టార్‌ స్కెల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. […]

క్రొయేషియాపై పగబట్టిన ప్రకృతి.. ఇటు లాక్‌డౌన్.. అటు భూకంపం..

Edited By:

Updated on: Mar 23, 2020 | 12:33 PM

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంటే.. మరోవైపు ప్రకృతి కూడ కనికరించడం లేదు. మొన్న గ్రీస్‌లో భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా.. క్రోయేషియా రాజధాని జాగ్రెబ్‌లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది. ఇప్పటకే అక్కడ కరోనా ప్రభావంతో లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ప్రజలంతా ఇంటికే పరిమితమైపోయారు. ఈ క్రమంలో ఆదివారం భూకంపం రావడంతో.. ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. రిక్టార్‌ స్కెల్‌పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ.. పెద్ద ఎత్తున భవనాలు కుప్పకూలినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న రెస్క్యూటీం.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.