Morocco Earthquake: స్మశానంలా మారిన మొరాకో.. భూకంపంతో నిద్రలోని వారు నిద్రలోనే మృతి.. 600మంది మరణం.. ప్రధాని మోడీ సంతాపం..

తీర ప్రాంతాల్లోని రబాత్, కాసాబ్లాంకా, ఎస్సోయిరా ఈ భూకంపానికి ఎక్కువగా ప్రభావితయ్యాయి. ప్రజలు ఇళ్లలో ఉండవద్దని.. రక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమంటూ అధికారులు హెచ్చరించారు.  మరికొందరు వీధుల్లో నిద్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మొరాకో చరిత్రలో ఇంతటి భయంకరమైన భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అంటున్నారు. మొరాకోపాటు.. పొరుగున ఉన్న అల్జీరియాలో భూ  ప్రకంపనలు వచ్చాయి.

Morocco Earthquake: స్మశానంలా మారిన మొరాకో.. భూకంపంతో నిద్రలోని వారు నిద్రలోనే మృతి.. 600మంది మరణం.. ప్రధాని మోడీ సంతాపం..
Morocco Earthquake

Edited By:

Updated on: Sep 09, 2023 | 1:15 PM

ఉత్తర ఆఫ్రికాలోని మొరాకోలో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. భూ ప్రకంపనలు చాలా బలంగా  రావడంతో అనేక భవనాలు నేలకూలాయి. ఈ భూకంపంలో మరణించిన వారి సంఖ్య 600కి చేరింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైంది. అంతేకాదు ఈ భూకంపం అత్యంత శక్తివంతంగా ఉందని.. గత 120 ఏళ్లలో ఉత్తర ఆఫ్రికాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపమని తెలిపారు. భూకంపం సృష్టించిన విధ్వంసానికి సంబంధించిన అనేక చిత్రాలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మొరాకోలో శుక్రవారం రాత్రి సంభవించిన భూకంపంతో ఈ ప్రాంతం క్షణాల్లో శిథిలావస్థకు చేరుకుంది. రాత్రి నిద్రలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా నివాసితులు ఇళ్ళు ఊగుతున్నట్లు గ్రహించారు. కొందరు భయంతో బయటకు వచ్చేలోపే పలు ఇళ్లు కూలిపోయాయి. విద్యుత్, టెలికాం కనెక్షన్లు వెంటనే కట్ అయ్యాయి. భవనాల శిథిలాల కింద నుంచి .. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఏడుపులు, మూలుగుల శబ్దం మాత్రమే వినిపించాయని కొందరు బాధితులు చెబుతున్నారు. నదిలో నీరు ఉప్పొంగి ఒడ్డును తాకింది.

యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ ప్రకంపనల మూలం మొరాకోలోని మరకేష్ నుండి 71 కి.మీ.లో  18.5 కి.మీ. లోతులో ఏర్పడింది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:00 గంటలకు ప్రకంపనలు సంభవించాయి.

తీర ప్రాంతాల్లోని రబాత్, కాసాబ్లాంకా, ఎస్సోయిరా ఈ భూకంపానికి ఎక్కువగా ప్రభావితయ్యాయి. ప్రజలు ఇళ్లలో ఉండవద్దని.. రక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లమంటూ అధికారులు హెచ్చరించారు.  మరికొందరు వీధుల్లో నిద్రించడానికి ప్రయత్నిస్తున్నారు. మొరాకో చరిత్రలో ఇంతటి భయంకరమైన భూకంపం ఎప్పుడూ సంభవించలేదని అంటున్నారు. మొరాకోపాటు.. పొరుగున ఉన్న అల్జీరియాలో భూ  ప్రకంపనలు వచ్చాయి.

ఈ ఘటనపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రజల మరణవార్త చాలా బాధ కలిగించిందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.  ఈ కష్ట సమయంలో మొరాకో ప్రజలకు తన సానుభూతిని తెలియజేస్తూ .. భారతదేశం అన్ని సహాయానికి సిద్ధంగా ఉందని మొరాకో ప్రజలకు హామీనిచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..