Earthquake: తూర్పు తీరంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు

|

Mar 12, 2021 | 8:12 AM

Earthquake: భూకంపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో సంభవిస్తున్న భూకంపాల వల్ల మన దేశంలో పెద్దగా నష్టాలు ఉండకున్నా ఇతర దేశాల్లో సంభవించే భూ ప్రకంపనల వల్ల..

Earthquake: తూర్పు తీరంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదు.. ఇళ్ల నుంచి పరుగులు తీసిన ప్రజలు
Delhi Earthquake
Follow us on

Earthquake: భూకంపాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో సంభవిస్తున్న భూకంపాల వల్ల మన దేశంలో పెద్దగా నష్టాలు ఉండకున్నా ఇతర దేశాల్లో సంభవించే భూ ప్రకంపనల వల్ల పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవిస్తోంది. తాజాగా రష్యా తూర్పు తీరంలోని కంచట్కా పెనిన్సులా ప్రాంతంలో శుక్రవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.0గా నమోదైనట్లు రష్యాకు చెందిన జియోఫిజికల్‌ సర్వే శాస్త్రవేత్తలు వెల్లడించారు. భారీ శబ్దాలతో సంభవించిన భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల ఏమైనా ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందా ..?అనే దానిపై పరిశీలిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు.

అయితే 43 కిలోమీటర్ల లోతులో 99 కిలోమీటర్ల మేర భూమి కంపించిందని తెలిపారు. ఈ భూకంపం అనంతరం ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాగా, తరచుగా కంచట్కా పెనిన్సులా ప్రాంతంలో భూకంపాలు సంభవిస్తున్నాయి.

ఇవి చదవండి :

గంపెడు టమాటల కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. 20 మంది మృతి.. రంగంలోకి దిగిన పోలీసులు.. కఠినమైన ఆంక్షలు

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన కుమారుడే తల్లిదండ్రులపైన కేసు పెట్టాడు.. కారణం ఏమిటో తెలిస్తే..

నాలుగు రోజులగా కురుస్తున్న వర్షాలు.. హవాయిని ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఐలండ్ స్టేట్..