Doomsday Plane: ఇరాన్ vs ఇజ్రాయెల్.. ఈ అమెరికన్ విమానం ఎగిరిందంటే.. ఏదో దేశానికి మూడినట్టే!
అమెరికా 'డూమ్స్‌డే విమానం' అని పిలువబడే E-4B నైట్‌వాచ్ విమానం ఇటీవల అనుమానాస్పదంగా ఎగురుతూ కనిపించింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానం యాక్టివేట్ కావడం అమెరికా యుద్ధంలో పాల్గొనే అవకాశాన్ని సూచిస్తుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Doomsday Plane
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న నేపథ్యంలో మంగళవారం రాత్రి వాషింగ్టన్ డీసీలోని జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు అమెరికన్ ‘డూమ్స్‌డే విమానం’ ఎగురుతూ కనిపించింది. ఈ విమానం యాక్టివేట్ కావడంతో ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా పాల్గొనబోతుందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే.. ఇది సాధారణ విమానం కాదు. దీన్ని డూమ్స్‌డే విమానం అని పిలుస్తుంటారు.. అంతే ప్రళయ విమానం అని. యుద్ధ సమయాల్లో దీన్ని అమెరికాకు ఒక బ్రహ్మాస్త్రంలా ఉపయోగపడుతుంది.
- ఈ విమానం అధికారిక నామం.. బోయింగ్ E-4B నైట్ వాచ్. కానీ, ప్రపంచం మొత్తం దీన్ని ‘డూమ్స్ డే ప్లేన్’ అనే పిలుస్తుంది. ఆ భయంకర విమానం గురించి ఇప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
- ‘డూమ్స్‌డే ప్లేన్’ గా పిలువబడే E-4B నైట్‌వాచ్ మంగళవారం లూసియానా నుండి మేరీల్యాండ్‌కు అకస్మాత్తుగా విమానంలో ప్రయాణించిన తర్వాత వార్తల్లో నిలిచింది.
- ఈ విమానం అధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ లకు వైమానిక కమాండ్ సెంటర్ లాగా పనిచేస్తుంది. సంక్షోభ సమయంలో సురక్షితమైన కమ్యూనికేషన్లు, సమన్వయాన్ని నిర్వహించడానికి వారికి సహాయపడుతుంది.
- ఈ యుద్ధ విమానం బోసియర్ సిటీ నుండి సాయంత్రం 5:56 కి బయలుదేరి, తీరప్రాంతం వెంబడి ప్రయాణించి, వర్జీనియా-నార్త్ కరోలినా సరిహద్దు దగ్గర చక్కర్లు కొట్టి, రాత్రి 10:01 గంటలకు జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ల్యాండ్ అయింది.
- విమానం నాలుగు గంటల పాటు గాల్లోనే ప్రయాణించింది. దీంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా దాని సాధారణ కోడ్ ORDER6 కాకుండా భిన్నమైన ORDER01 అనే కాల్‌సైన్‌ను ఉపయోగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
- ఈ బోయింగ్ E-4B నైట్‌వాచ్‌లో 112 మంది ప్రయాణించే సౌకర్యం ఉంది. 7,000 మైళ్లకు పైగా విమాన ఏకధాటిగా ప్రయాణిస్తుంది.
- ఈ విమానం ప్రత్యేక లక్షణాలు ఏ ఇతర అమెరికన్ సైనిక విమానాలతోనూ సాటిలేనివి.
- ఇది అణు విస్ఫోటనాలు, సైబర్ దాడులు తట్టుకుంటుంది. విద్యుదయస్కాంత జోక్యాన్ని నిరోధించగలదు. అవసరమైతే ఎదురుదాడులు కూడా చేస్తుంది.
- ఈ విమానం నిరంతరంగా ఒక వారం పాటు గాల్లోనే ఉండగలదు. గాలిలో ఇంధనం నింపుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఏకధాటిగా 35.4 గంటలు ప్రయాణిస్తుంది.
- విమానం లోపలి భాగంలో 18 పడకలు, బ్రీఫింగ్‌ల కోసం ఒక గది, మీటింగ్ హాల్, కమాండ్ స్పేస్, విశ్రాంతి గదలు ఉన్నాయి. ఇవి మూడు స్థాయిలలో విస్తరించి ఉన్నాయి, అత్యవసర సమయాల్లో ఇది “ఫ్లయింగ్ పెంటగాన్”గా పని చేస్తుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
