Covid-19 Third Wave: ఇండోనేషియాను వణికిస్తున్న కరోనా థర్డ్ వేవ్.. ‘డెల్టా’తో కేసుల విజృంభణ.. నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు..

|

Jul 06, 2021 | 8:51 AM

Covid-19 Outbreaks in Indonesia: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం పుట్టుకొస్తున్న

Covid-19 Third Wave: ఇండోనేషియాను వణికిస్తున్న కరోనా థర్డ్ వేవ్.. ‘డెల్టా’తో కేసుల విజృంభణ.. నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు..
Indonesia Covid 19
Follow us on

Covid-19 Outbreaks in Indonesia: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విలయతాండవం సృష్టించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం పుట్టుకొస్తున్న కోవిడ్ వేరియంట్లతో అంతటా ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో అత్యంత ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ అనేక దేశాల్లో కొరలు చాస్తోంది. ఈ క్రమంలో ఇండోనేషియాను థర్డ్ వేవ్ వణికిస్తోంది. డెల్టా ప్లస్ వేరియంట్‌తో ఆ దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. డెల్టా వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆక్సిజన్ కొరత, బెడ్ల కొరతతో రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇండోనేషియాలో డేల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేసులు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా నమోదవుతున్నాయి.

ఇండోనేషియాలో సోమవారం ఒక్కరోజే 29,749 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు 558 మరణాలు సంభవించాయి. కరోనా మహమ్మారి మొదలయ్యాక ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. దీంతో ఇండోనేషియాలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలాఉంటే.. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న వేళ మెడికల్ ఆక్సిజన్ నిల్వలు లేకపోవడం దేశంలో ఆందోళన రేకెత్తిస్తోంది. కరోనా మరణాల్లో చాలా మంది ఆక్సిజన్ అందకపోవడంతోనే మరణిస్తున్నారు. అయితే.. ఆక్సిజన్ అందక నిన్న ఒక ఆస్పత్రిలో 60 మందికి పైగా రోగుల మృతిచెందారు. జకార్తా, బాంటెన్, పశ్చిమ జావా, యోగ్యకార్తాలోని ఆసుపత్రుల్లో పడకలన్నీ నిండిపోయాయి. ఈ మేరకు ఇండోనేషియా ప్రభుత్వం అప్రమత్తమై చర్యలు చేపట్టింది.

Also Read:

Covid-19 Fake Report: భార్య నుంచి దూరంగా ఉండేందుకు ప్లాన్.. కరోనా ఫేక్‌ రిపోర్ట్‌‌తో వేషాలు.. ఆ తర్వాత ఏమైందంటే..?

Central Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి కొత్తగా 20 మందికి చోటు.. రేపు లేదా ఎల్లుండి మంత్రి మండలి విస్తరణకు అవకాశం!