AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట పెళ్లి సందడి.. ప్రియుడిని పెళ్లాడిన టిఫానీ.. వరుడు ఎవరంటే..?

ట్రంప్‌ డాటర్‌ టిఫానీ మ్యారేజ్‌ గ్రాండ్‌గా జరిగింది. తన బాయ్​ఫ్రెండ్ మైఖెల్ బౌలస్‌ను పెళ్లాడారు టిఫానీ. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో ట్రంప్‌ దగ్గరుండి ఈ పెళ్లిని జరిపించారు.

Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇంట పెళ్లి సందడి.. ప్రియుడిని పెళ్లాడిన టిఫానీ.. వరుడు ఎవరంటే..?
Donald Trump
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Nov 14, 2022 | 7:50 AM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు టిఫానీ ట్రంప్ పెళ్లిపీటలెక్కారు. టిపానీ తన ప్రియుడు వ్యాపారవేత్త మైఖెల్ బౌలోస్‌ను పెళ్లి చేసుకున్నారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన మార్ ఎ లాగో రిసార్ట్​లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాలుగేళ్ల ప్రేమాయాణం అనంతరం మూడుముళ్ల బంధంతో ఈ జంట ఒక్కటైంది. పెళ్లిలో తెలుపు రంగు గౌను ధరించి మెరిసిపోయారు టిఫానీ ట్రంప్.. తన కూతురు టిఫానీని వెంటబెట్టుకొని వివాహ వేదికకు తీసుకువచ్చారు. ఈ వేడుకకు ట్రంప్ కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. ట్రంప్ భార్య మెలానియా, మరో కూతురు ఇవాంకా ట్రంప్, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌, జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌, ఎరిక్‌ ట్రంప్‌, బారన్‌ ట్రంప్‌ ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. ఈ పెళ్లి ఫొటోలను యూఎస్ కాంగ్రెస్ లీడర్ అన్న పాలినా లునా షేర్ చేసి.. శుభాకాంక్షలు తెలిపారు.

2018లో టిఫానీ, మైఖెల్‌కు పరిచయం ఏర్పడింది.. వెకేషన్ కోసం లండన్ వెళ్లినప్పుడు టిఫానీ ట్రంప్ తొలిసారిగా బౌలోస్‌ను కలిశారు. మైఖేల్ సంపన్న లెబనీస్ కుటుంబానికి వారసుడు.. అప్పట్లో అక్కడి యూనివర్సిటీలో చదువుతుండేవాడు. ఆ తర్వాత 2019లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తమ ప్రేమను ప్రపంచానికి పరిచయం చేశారు. అనంతరం ఇరుకుటుంబాలు కూడా వారి ప్రేమను ఒప్పుకున్నాయి.

ఇవి కూడా చదవండి

2021 జనవరిలో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడి పదవి నుంచి తొలగిపోయే ముందు ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. డొనాల్డ్‌ ట్రంప్‌.. ఆయన రెండో భార్య, నటి మార్ల మాపుల్స్‌ ఏకైక కూతురే టిఫానీ. 1993లో మార్లను ట్రంప్‌ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 1999లో విడాకులు తీసుకున్నారు. అనంతరం మెలానియాను డొనాల్డ్ ట్రంప్‌ వివాహమాడారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్.. భారీగా తగ్గించిన జీతాలు..
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
ఇంటిలో వేప చెట్టు ఉండటం మంచిదేనా?
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
గోంగూర గొప్పతనం ఇదే మరీ.. రోజూ గుప్పెడు తిన్నారంటే..ఆ సమస్యలన్నీ
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే..
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఆగడు విషయంలో తప్పు జరిగిందక్కడే.. సెకండాఫ్ అలా చేసి ఉంటే
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడేవారికి హెచ్చరిక.. జాగ్రత్తలు ఇవే..
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
నాగ్‌పూర్‌లో కివీస్‌కు నరకం చూపించే బ్యాచ్.. ఫోకస్ ఇద్దరిపైనే..?
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
బాప్‌రే.. బ్లూ బెర్రీస్ తింటే ఇన్ని లాభాలా..? అస్సలు వదలకండి
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
నోరూరించే కోడి గుడ్డు పచ్చడి.. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేయండి!
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత
సినిమాలో వద్దన్నాడు.. రాజకీయాల్లో ఇస్తాన్నాడు.. కరుణానిధి, జయలలిత