AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధాని మోదీకి ట్రంప్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?

అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు మోదీ. తొలుత మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ ఇద్దరి భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రంప్‌ తన గుర్తుగా.. ఓ బుక్‌ను మోదీకి బహూకరించారు. తాను స్వయంగా రాసిన ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ అనే పుస్తకాన్ని..

PM Modi: ప్రధాని మోదీకి ట్రంప్‌ స్పెషల్‌ గిఫ్ట్‌.. ఏంటో తెలుసా?
Pm Modi & Donald Trump
Ravi Kiran
|

Updated on: Feb 14, 2025 | 11:26 AM

Share

అమెరికా పర్యటనలో అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అయ్యారు మోదీ. తొలుత మోదీ బస చేసిన బ్లెయిర్‌ హౌస్‌కు వెళ్లారు ప్రధాని మోదీ. అక్కడ ఇద్దరి భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ట్రంప్‌ తన గుర్తుగా.. ఓ బుక్‌ను మోదీకి బహూకరించారు. తాను స్వయంగా రాసిన ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ అనే పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు. భారత్‌లో పర్యటన సందర్భంగా అక్కడ దిగిన ఫొటోలతో కూడిన బుక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. అంతేకాదు గతంలో అమెరికాలోని టెక్సస్‌లో జరిగిన హౌడీ మోదీ సభ ఫొటోలనూ పొందుపరిచారు. భారత్‌తో… ముఖ్యంగా ప్రధాని మోదీతో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అంతేకాదు.. మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌ యూ ఆర్‌ గ్రేట్‌ అంటూ ఆ పుస్తకంపై రాశారు.

ట్రంప్‌ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చోటుచేసుకున్న కీలక సందర్భాలు, ప్రధాన ఈవెంట్లతో కూడిన ఫొటోబుక్‌ ఇది. ఇందులో ప్రధాని మోదీ 2019 నాటి అమెరికా పర్యటనలో నిర్వహించిన ‘హౌడీ మోదీ’, ఆ తర్వాత 2020లో ట్రంప్‌ భారత్‌కు విచ్చేసినప్పుడు ఏర్పాటుచేసిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయి. ఈ పుస్తకంపై మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌.. యూ ఆర్‌ గ్రేట్‌ అని రాసి ట్రంప్‌ సంతకం చేశారు. అనంతరం పుస్తకంలోని పేజీలను తిప్పుతూ వీరిద్దరూ ఉన్న ఫొటోలను మోదీకి ఆయన చూపించారు.

అనంతరం ట్రంప్‌ స్పందిస్తూ.. భారత ప్రధానికి ఆతిథ్యం ఇవ్వడం చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. మోదీ తనకు ఎన్నో ఏళ్లుగా గొప్ప స్నేహితుడని, వారిరువురి మధ్య మంచి అనుబంధం ఉందని తెలిపారు. ప్రధాని మోదీ కూడా ట్రంప్‌పై ప్రశంసలు కురిపించారు. ట్రంప్‌ దేశ ప్రయోజనాలకు అత్యున్నత ప్రాధాన్యమిస్తారని, ఇది చాలా అభినందించదగ్గ విషయం అన్నారు. అమెరికా అధ్యక్షుడి నుంచి తాను నేర్చుకున్నది అదేనని, ఆయన ఆయన లాగే తాను కూడా భారత ప్రయోజనాలకే అధిక ప్రాముఖ్యతనిస్తానని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం వీరిద్దరూ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇరు దేశాల పరస్పర వాణిజ్య, రక్షణబంధం బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు దేశాధినేతలు తెలిపారు. అమెరికా పర్యటనను ముగించుకొని ప్రధాని మోదీ భారత్‌కు తిరుగుపయనమయ్యారు.

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!