AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డోనాల్డ్ ట్రంప్ ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. పక్కా ఆధారులున్నాయి.. మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం గురించి ఊహాగానాల మధ్య, డొనాల్డ్ ట్రంప్ చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని ట్రంప్ మేనల్లుడు ఫ్రెడ్ ట్రంప్-III సంచలన బాంబు పేల్చాడు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మేనల్లుడు, ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ కుమారుడు ఫ్రెడ్ ట్రంప్-III, ట్రంప్ కుటుంబంలో మతిమరుపు ఇబ్బందికరమైన చరిత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

డోనాల్డ్ ట్రంప్ ఆ వ్యాధితో బాధపడుతున్నారు.. పక్కా ఆధారులున్నాయి.. మేనల్లుడు సంచలన వ్యాఖ్యలు
Trump Dementia Evidence
Balaraju Goud
|

Updated on: Jun 21, 2025 | 6:56 PM

Share

అమెరికా అధ్యక్షుడి మానసిక ఆరోగ్యం గురించి ఊహాగానాల మధ్య, డొనాల్డ్ ట్రంప్ చిత్తవైకల్యంతో బాధపడుతున్నారని ట్రంప్ మేనల్లుడు ఫ్రెడ్ ట్రంప్-III సంచలన బాంబు పేల్చాడు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మేనల్లుడు, ఫ్రెడ్ ట్రంప్ జూనియర్ కుమారుడు ఫ్రెడ్ ట్రంప్-III, ట్రంప్ కుటుంబంలో మతిమరుపు ఇబ్బందికరమైన చరిత్ర ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మామ ప్రస్తుత అధ్యక్షులు ట్రంప్ మానసిక ఆరోగ్యం గురించి తీవ్ర ఆందోళనలను ఆయన వ్యక్తం చేశారు. అతను ఇటీవల ఆల్ ఇన్ ది ఫ్యామిలీ: ది ట్రంప్స్ అండ్ హౌ వి గాట్ దిస్ వే అనే పుస్తకాన్ని రచించారు. ఇది ట్రంప్ కుటుంబం సంక్లిష్ట స్థితిగతలు, సంఘర్షణలు, వారసత్వాన్ని లోతుగా తెలియజేస్తుంది.

గత శుక్రవారం(జూన్ 20) సిరియస్ఎక్స్ఎమ్ ది డీన్ ఒబెయిడల్లా షోలో ఇచ్చిన ఒక స్పష్టమైన ఇంటర్వ్యూలో, ఫ్రెడ్ ట్రంప్ III ప్రస్తుత అధ్యక్షుడి మానసిక దృఢత్వం గురించి, ఆతనిపై పెరుగుతున్న ఆందోళనలను వ్యక్తం చేశారు. మునుపటి కుటుంబ కేసులతో తనకు ఇబ్బందికరమైన సారూప్యతలు కనిపిస్తున్నాయన్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తండ్రి 1999లో చనిపోయే ముందు ఎనిమిది సంవత్సరాల పాటు అల్జీమర్స్ వ్యాధితో బాధపడ్డారని ఆయన గుర్తు చేశారు. చిత్తవైకల్యం వారి కుటుంబంపై లోతైన ముద్ర వేసిందని ఫ్రెడ్ స్పష్టం చేశారు. తన మామ ట్రంప్ ప్రవర్తనలో ఇటీవలి కనిపించిన సంకేతాలు అశాంతిని రేకెత్తించాయని అన్నారు.

ఇటీవల ట్రంప్ ప్రవర్తనకు, వారి బంధువు జాన్ వాల్టర్స్ సహా చిత్తవైకల్యంతో పోరాడిన ఇతర బంధువుల ప్రవర్తనకు మధ్య సారూప్యతలు ఉన్నాయని అన్నారు. “మీకు తెలుసా, డోనాల్డ్, ‘ఓహ్, నా తండ్రి చివరి వరకు టిప్‌టాప్‌గా ఉన్నాడు’ అని అన్నాడు. కానీ అది వాస్తవం కాదు. నా తాతలో నేను ఏమి చూశానో నాకు తెలుసు” అని ఐరిష్ స్టార్ ఫ్రెడ్ పేర్కొన్నారు. “డోనాల్డ్ అక్క, నా అత్త మరియాన్నేలో నేను ఏమి చూశానో నాకు తెలుసు, చివరికి ఆమెకు ఇలాగే జరిగింది. నేను డాక్టర్ కాదు, నేను డాక్టర్ లా నటించను. నా తాతగారి ఇద్దరి నుండి వచ్చే హెచ్చరిక సంకేతాలు నాకు తెలుసు.” అని ఫ్రెడ్ అన్నారు. “కానీ ట్రంప్ చెబుతున్న విషయాలు, వెర్రితనం, అతను ఒక సందేశానికి కట్టుబడి ఉండలేడు.” అన్నారు. కాగా, అతని సోదరి, మేరీ ట్రంప్ కూడా ఇలాంటి అంశాలపై పుస్తకాలు రాశారు.

అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యతిరేకంగా తన ప్రచారంలో ట్రంప్ స్వయంగా ఫిట్‌నెస్‌ను ట్రంప్ కేంద్ర దాడిగా చేసుకున్నాడు. తరచుగా తన ప్రత్యర్థి మానసిక క్షీణత బాగులేదంటూ ట్రంప్ ఆరోపించారు. బైడెన్ తీక్షణత గురించి ఓటర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ స్వంత స్థితి గురించి బహిరంగ చర్చల జరుగుతుండటం ఆందోళనలు రేకేత్తిస్తున్నాయి. ఇప్పుడు అతని స్వంత కుటుంబ సభ్యులు దీనిని మరింతగా చెబుతుండటం మరింత హట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..