ట్రంప్ దాడి వెనుక రహస్యం ఏంటి? దుండగుడు దాగున్న ఆ బిల్డింగ్‌లోనే.. అంత పెద్ద కంపెనీపైకి ఎలా వెళ్లాడు!
ఎన్నికల ప్రచారంలో భాగంగా ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరో గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి 120 మీటర్ల దూరంలో ఉన్న భవనంపై నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే, సంఘటనా స్థలంలో మోహరించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే మట్టుబెట్టారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ దాడిని ట్రంప్‌ను హత్య చేసే ప్రయత్నంగా భావిస్తున్నాయి...

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికాలోని పెన్సిల్వేనియాలో ర్యాలీలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై దాడి చేసిన వ్యక్తి ఎవరో గుర్తించారు. దాడి చేసిన వ్యక్తి 120 మీటర్ల దూరంలో ఉన్న భవనంపై నుంచి ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. అయితే, సంఘటనా స్థలంలో మోహరించిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు దాడి చేసిన వ్యక్తిని అక్కడికక్కడే మట్టుబెట్టారు. అమెరికా దర్యాప్తు సంస్థలు ఈ దాడిని ట్రంప్‌ను హత్య చేసే ప్రయత్నంగా భావిస్తున్నాయి. రాష్ట్రంలోని ఓటరు రికార్డుల ప్రకారం.. డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నానికి యత్నించగా అతనిపై కాల్పులు జరిపిన యువకుడు రిజిస్టర్డ్ రిపబ్లికన్ సభ్యుడు. అయితే ట్రంప్‌పై దాడికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు.
కాని కొన్ని నివేదికలు ప్రకారం.. దాడి చేసిన వ్యక్తి, కాల్పులకు ఉపయోగించిన ఆయుధం గురించి సమాచారం బయటకు వచ్చింది. దాడి చేసిన వ్యక్తిని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్, పెన్సిల్వేనియాలోని బెతెల్ పార్క్ నివాసిగా గుర్తించారు సిక్రెట్ సర్వీస్ సిబ్బంది. ఇది బెతెల్ పార్క్ బట్లర్‌కు దక్షిణంగా 40 మైళ్ల దూరంలో ఉంది. ఘటనా స్థలం నుంచి AR-15 సెమీ ఆటోమేటిక్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఈ రైఫిల్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపారని చెబుతున్నారు.

దుండగుడిని మట్టుబెట్టింది ఈ సిక్రెట్ సర్వీస్ సిబ్బందే..
ఆ వ్యక్తి ఆ భవనంపైకి ఎలా ప్రవేశించాడు?
ఇదిలా ఉంటే.. డోనాల్డ్ ట్రంప్ నిలబడి ప్రసంగం చేస్తున్న భవనం నుండి దాడి చేసిన వ్యక్తి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు., అక్కడ ఒక గిడ్డంగి లాంటి భవనం ఉంది. ఆ భవనం నుంచే ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. ఆ భవనం చుట్టూ యూఎస్ సీక్రెట్ సర్వీస్ బృందం భారీగా మోహరించింది. దాడి చేసిన వ్యక్తి కాల్పులు జరిపిన వెంటనే, సిక్రెట్ సర్వీస్ కౌంటర్-స్నిపర్ బృందం అప్రమత్తమైంది. దాదాపు 200 మీటర్ల దూరం నుండి ప్రతీకారం తీర్చుకుంది. దాడి చేసిన వ్యక్తిని కాల్చి చంపేశారు.
దాడి చేసిన వ్యక్తి మృతదేహం లభించిన భవనం ఏజీఆర్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు భద్రతా సిబ్బంది. ఇది గాజు, ప్లాస్టిక్ ప్యాకేజింగ్ పరిశ్రమకు ఆటోమేటిక్ పరికరాలను సరఫరా చేసే అంతర్జాతీయ సంస్థ. ఈ కంపెనీ ఐరోపా, ఆసియా, లాటిన్ అమెరికన్ మార్కెట్‌లకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. అయితే ఇంత అంతర్జాతీయ కంపెనీ అయిన ఈ భవనంలోకి దుండగుడు ఎలా ప్రవేశించాడు అనే ఆరా తీస్తున్నారు పోలీసులు. అంత పెద్ద కంపెనీలోకి వెళ్లాలంటే భారీ చెకింగ్ ఉంటుంది. ఈ కంపెనీలో ఉండే వారు ఎందుకు గమనించలేదు..? అని కూడా ఆరా తీస్తున్నారు సిక్రెట్ సర్వీస్ సిబ్బంది. అంతేకాకుండా దుండుగు ట్రంప్‌పై కాల్పులు జరిపేందుకు ఆ భవనంనే ఎందుకు ఎంచుకున్నాడు.. అంత పెద్ద కంపెనీ అయి ఉన్నా దుండగుడు ఎలా వెళ్లగలిగాడు? తదితర అంశాలపై యూఎస్ సిక్రెస్ సర్వీస్ సిబ్బంది దర్యాప్తు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ టవర్ భద్రతను పెంచారు
బట్లర్‌లో జరిగిన ర్యాలీలోడోనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగిన తరువాత, న్యూయార్క్ పోలీసులు ట్రంప్‌కు భద్రతను పెంచారు. యూఎస్ సీక్రెట్ సర్వీసెస్‌కు చెందిన అనేక బృందాలు ఈ దాడికి సంబంధించిన ప్రతి కోణాన్ని పరిశీలిస్తున్నాయి. దాడికి సంబంధించిన ఆధారాలను కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ట్రంప్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యుల భద్రతను కూడా అనేక రెట్లు పెంచారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి