Donald Trump Visa Restrictions: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ వెళ్లిపోతున్న క్రమంలో మరోసారి తన ప్రతాపాన్ని చూపించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో గ్రీన్‌కార్డులు, వర్కింగ్ వీసాల జారీపై నిషేధం విధించారు. అయితే గత ఉత్తర్వుల ప్రకారం ఆంక్షలు డిసెంబర్ 31తో ముగిశాయి. కానీ తాజాగా 2021 మార్చి 31 వరకు నిషేధిత ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లేందుకు సిద్ధమవుతున్న విదేశీ నిపుణులకు, అలాగే భారతీయులకు ట్రంప్ న్యూఇయర్ గట్టి షాకిచ్చినట్లయింది.
అలాగే అమెరికాలో చట్టాలను ఉల్లంగించిన పౌరులను స్వదేశానికి రప్పించడానికి నిరాకరించిన దేశాలపై వీసా ఆంక్షలను సైతం ట్రంప్ గురువారం నిరవధికంగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే మరి కొన్ని గంటల్లోనే ఈ ఆంక్షలు ముగుస్తుందనగా నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.
కాగా, ఈ ఏడాది జనవరి 20తో డొనాల్డ్ ట్రంప్ పదవి కాలం ముగియనుంది. కానీ వెళ్తూ వెళ్తూ మరో షాకింగ్ నిర్ణయం తీసుకోవడం అందరిని విస్మయానికి గురి చేస్తోంది. అయితే తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ తప్పుబడుతున్నారు. తాను వచ్చాక ట్రంప్ తీసుకున్న నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకుంటానని తెలిపారు. అయితే ట్రంప్ ఉత్తర్వులు వెంటనే ఉపసంహరించడానికి వీలులేని విధానంలో జారీ చేసినట్లు అక్కడి నిపుణులు చెబుతున్నారు. మరి ఎంత వరకు సాధ్యమనేది తెలియదు.
Also Read: Asia’s richest person: ఇకపై ఆసియా కుబేరుడు ముకేశ్ కాదు.. అతణ్ని వెనక్కి నెట్టింది ఎవరో తెలుసా.?