అమెరికా అధ్యక్షుడికి ఘన స్వాగతం.. డొనాల్డ్ ట్రంప్‌ను బంగారు కిరీటంతో సత్కరించిన దక్షిణ కొరియా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ APEC సమ్మిట్‌లో పాల్గొనడానికి దక్షిణ కొరియాకు వచ్చారు. కొరియాలో ఆయనకు ప్రత్యేకమైన స్వాగతం లభించింది. ట్రంప్ ను బంగారు కిరీటంతో సత్కరించన దక్షిణ కొరియా అధ్యక్షులు, ఆ దేశ అత్యున్నత గౌరవం అయిన గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వాను ప్రదానం చేశారు. ఈ గౌరవం చాలా ప్రత్యేక వ్యక్తులకు లేదా విదేశీ దేశాధినేతలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

డొనాల్డ్ ట్రంప్‌నకు బహూకరించిన కిరీటం అందంగా పొందించడం జరిగింది. ఇందులో పొడవైన బంగారు ముళ్ళు, వేలాడుతున్న బంగారు ఆకు లాంటి ముక్కలు ఉన్నాయి. ఈ కిరీటం శాంతి, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ కిరీటం కొరియా ద్వీపకల్పంలో శాంతియుత భవిష్యత్తు కోసం యునైటెడ్ స్టేట్స్, దక్షిణ కొరియా కలిసి పనిచేసే కొత్త శకానికి ప్రతీకగా భావిస్తున్నారు.
బంగారు కిరీటం కథ ఏమిటి?
ట్రంప్ కు బహూకరించిన కిరీటం నిజమైనది కాదు. ప్రతిరూపం మాతమ్రే. ఈ కిరీటం జియోంగ్జు నగరంలో లభించిన చియోన్మాచోంగ్ అనే నిజమైన బంగారు కిరీటానికి ప్రతిరూపం. ఈ నగరం అత్యంత చారిత్రాత్మక నగరం. ఒకప్పుడు 9వ శతాబ్దం వరకు కొరియా ద్వీపకల్పంలో ఎక్కువ భాగాన్ని పాలించిన సిల్లా రాజ్యానికి రాజధానిగా ఉండేది. ట్రంప్ కు దక్షిణ కొరియా అత్యున్నత పౌర పురస్కారం గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ ముగుంగ్వా కూడా లభించింది. ఈ గౌరవానికి ముగుంగ్వా పువ్వు పేరు పెట్టారు. దీనిని ఆంగ్లంలో రోజ్ ఆఫ్ షారన్ అని పిలుస్తారు. ఇది దక్షిణ కొరియా జాతీయ పుష్పం. శాంతిని నెలకొల్పడానికి ట్రంప్ చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని ప్రదానం చేస్తున్నట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ పేర్కొన్నారు.
గౌరవ పతకాన్ని అందుకుంటున్న సమయంలో ట్రంప్ సరదాగా మాట్లాడుతూ, “నేను ఇప్పుడే దాన్ని ధరించాలనుకుంటున్నాను” అని అన్నారు. ఈ అవార్డును అందుకున్న తొలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ పర్యటన సందర్భంగా, ట్రంప్ అధ్యక్షుడు లీతో వాణిజ్య ఒప్పందాలు, సుంకాల తగ్గింపులపై చర్చించారు. అమెరికాలో పెట్టుబడులు పెరగడానికి బదులుగా, అమెరికా తన వస్తువులపై గరిష్టంగా 15% సుంకం విధించాలని దక్షిణ కొరియా కోరుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..