దివ్వెల పండగ దీపావళిని భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. పలు దేశాలు దీపావళి పండగను అధికారకంగా సెలవు దినంగా ప్రకటించాయి కూడా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. అంతేకాదు సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ దీపావళి వేడుకలను నిర్వహించే సమయంలో అమెరికన్ మిలిటరీ బ్యాండ్ హిందీ భక్తిగీతమైన ‘ఓం జై జగదీష్ హరే’ని ప్లే చేస్తున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X లో వైరల్‌గా మారింది. గీతా గోపీనాథ్ అమెరికన్ మిలిటరీ బ్యాండ్ మెస్మరైజింగ్ వీడియోను షేర్ చేశారు.
Wonderful to hear the White House military band play Om Jai Jagdeesh Hare for Diwali. Happy Diwali 🪔 pic.twitter.com/lJwOrCOVpo
ఇవి కూడా చదవండి— Gita Gopinath (@GitaGopinath) October 31, 2024
అంతేకాదు యునైటెడ్ స్టేట్స్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దీపావళి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సాస్ రాష్ట్రాలు దీపావళిని అధికారికంగా సెలవు దినంగా గుర్తించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం అమెరికాలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లు దివ్వెల కాంతిలో వెలుగొందాయి. నిత్యం బిజీగా ఉండే ప్రవాస భారతీయులు ఒక చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దీపావళిని భారత్‌లో అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు.
Happy Diwali from the White House! Together, may we show the power in the gathering of light. pic.twitter.com/IHKn2gvj5s
— The White House (@WhiteHouse) October 29, 2024
దీపావళి పండగ యునైటెడ్ స్టేట్స్‌లో వెలుగులు నింపుతోంది. ఉత్సాహపూరితమైన వేడుకలతో ప్రవాస భారతీయులను ఏకం చేసింది. వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు మాత్రమే కాదు .. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో అద్భుతమైన లైట్లతో దీపావళి సందడి నెలకొంది. న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ ప్లాజాలో దీపావళి పండుగ ప్రారంభమైంది. అయితే టెక్సాస్ లో బాణసంచా అమ్మకాలను చట్టబద్ధం చేసింది.
టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వెలుగులు నింపింది.
న్యూయార్క్‌లో వేడుకలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి చెందిన అధికారిక X ఖాతా @IndiainNewYork, టైమ్స్ స్క్వేర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. “ప్రపంచంలోని క్రాస్‌రోడ్స్-టైమ్స్ స్క్వేర్ నుండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు!” పండుగ సందేశంలో భాగంగా అందరి ఆనందం, శ్రేయస్సును కోరుకుంటున్నట్లు కాన్సులేట్ రాసింది.
Spreading joy on the festival of lights!
New York state landmarks – NY State Capitol, Erastus Corning II Tower at the Empire State Plaza and Legislative building light up on the occasion of Diwali@GovKathyHochul @NYGov @Indianembassy@IndianDiplomacy@MEAIndia https://t.co/YbnFZ13iuK
— India in New York (@IndiainNewYork) October 31, 2024
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..