కొవిడ్ సోకిన వ్యక్తులకు మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనా బారినపడిన వారిపై జరిపిన పరిశోధనల్లో ఈ విషయం బయటపడినట్లు తెలిపారు. భవిష్యత్ లో కూడా మధుమేహం తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందని ఆధారాలు ఉన్నాయంటున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ లో ప్రచురించబడిన అర్టికల్ లో ఈ విషయాన్ని వెల్లడించారు.
కోవిడియాబ్ రిజిస్ట్రీ ప్రాజెక్టులో పాల్గొన్న 17 మంది ప్రముఖ డయాబెటిస్ నిపుణులతో కూడిన అంతర్జాతీయ బృందం ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కరోనా రోగులలో కొత్త డయాబెటిస్ కేసుల నమోదు కోసం గ్లోబల్ రిజిస్ట్రీ ఏర్పాటు చేసింది.
కరోనా రోగులలో మధుమేహం ప్రభావం, విస్తృతి లక్షణాలకు సంబంధించిన అంశాలపై నిపుణులు పరిశోధనలు నిర్వహించారు. కొవిడ్ చికిత్స సమయంలో కోలుకున్న వారిలో మధుమేహం లక్షణాలపై పర్యవేక్షణ కోసం ఉత్తమ గ్లోబల్ రిజిస్ట్రీ అధ్యయనం చేసింది. కొవిడ్ సోకిన వ్యక్తుల్లో మధుమేహం ప్రభావం పెరిగి మరణాలకు దారిస్తుందని క్లినికల్ పరిశీలనల్లో వెల్లడైనట్లు నిపుణుల బృందం పేర్కోంది. కరోనాతో మరణించిన రోగులలో 20 నుండి 30 శాతం మధ్య మధుమేహం ఉన్నట్లు నివేదించబడింది. మరోవైపు, కరోనా ఉన్నవారిలో కొత్తగా మధుమేహం రావచ్చని.. ఇందుకు ముందు మధుమేహం ఉన్నవారిలో వైవిధ్య జీవక్రియ సమస్యలు, ప్రాణాంతకంగా మారవచ్చని గుర్తించినట్లు నిపుణుల బృందం ఈ కథనంలో పేర్కోంది.
కానీ, కరోనాకి కారణమయ్యే సార్స్ కొవిడ్-2 అనే వైరస్ మధుమేహాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, సార్స్ కొవిడ్-2 తో బంధించే ప్రోటీన్ ACE-2, వైరస్ మానవ కణాలలోకి ప్రవేశిస్తుందని గతంలో నిర్వహించిన పరిశోధనల్లోనే వెల్లడైందని నిపుణులు తెలిపారు. ఇది ఉపిరితిత్తులలోనే కాకుండా, క్లోమం, గ్లూకోజ్ జీవక్రియలోని అవయవాలు, కణజాలాలలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇక చిన్న ప్రేగు, కొవ్వు కణజాలం, కాలేయం మరియు మూత్రపిండాలల్లో ప్రభావం ఉంటుందన్నారు. ఈ కణజాలాలలోకి ప్రవేశించడం ద్వారా, వైరస్ గ్లూకోజ్ జీవక్రియ పూర్తిగా పనిచేయకపోవటానికి కారణమవుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఇప్పటికే వైరస్ ఇన్ఫెక్షన్లు టైప్ 1 డయాబెటిస్ కారణమవుతాయని చాలా సంవత్సరాలుగా నిరూపించబడిందని శాస్త్రవేత్తలు తెలిపారు.
డయాబెటిస్ దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటి. దీని కొవిడ్ -19 జత కలిస్తే కలిగే పరిణామాలను గుర్తించామన్నారు లండన్లోని కింగ్స్ కాలేజీలోని మెటబాలిక్ సర్జరీ ప్రొఫెసర్, కోవిడియాబ్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ కో-లీడ్ ఇన్వెస్టిగేటర్ ఫ్రాన్సిస్కో రూబినో. ఈ కొత్త కరోనావైరస్ తో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేసే అవకాశముందన్నారు. కొవిడ్ రోగుల్లో మధుమేహం క్రొత్త రూపం దాల్చుతుందేమోనన్నఅనుమానం వ్యక్తం చేశారు.
మెల్బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయంలో డయాబెటిస్ ప్రొఫెసర్, అంతర్జాతీయ డయాబెటిస్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షుడు, కోవిడియాబ్ రిజిస్ట్రీ ప్రాజెక్టులో కో-లీడ్ ఇన్వెస్టిగేటర్ పాల్ జిమ్మెట్ మాట్లాడుతూ.. కొవిడ్ రోగుల్లో కొత్తగా ప్రారంభించిన డయాబెటిస్ పరిమాణం ఇంకా తెలియదని.. భవిష్యత్తులో మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఈ గ్లోబల్ రిజిస్ట్రీని స్థాపించడం ద్వారా, సహాయపడే సంబంధిత క్లినికల్ పరిశీలనలను వేగంగా పంచుకోవాలని మేము అంతర్జాతీయ వైద్య సంఘాన్ని సూచిస్తున్నామన్నారు.
లండన్లోని కింగ్స్ కాలేజీలో డయాబెటిస్ రీసెర్చ్ ప్రొఫెసర్, కోవిడియాబ్ రిజిస్ట్రీ ప్రాజెక్ట్ యొక్క సహ పరిశోధకురాలు స్టెఫానీ అమియల్ ఇలా అన్నారు రిజిస్ట్రీ మామూలుగా సేకరించిన క్లినికల్ డేటాపై దృష్టి పెడుతుంది, ఇది ఇన్సులిన్ స్రావం సామర్థ్యం, ఇన్సులిన్ నిరోధకతతో పాటు ఆటో ఇమ్యూన్ యాంటీబాడీ స్థితిని ఎలా పరిశీలించాలో మాకు సహాయపడుతుందన్నారు. కొవిడ్ -19 బారినపడిన వారిలో మధుమేహాన్ని అధ్యయనం చేయడం వలన వ్యాధి యొక్క విధానాలను కనుగొనేందుకు గ్లోబల్ కోవిడియాబ్ రిజిస్ట్రీ.