Covid Cases: 20 లక్షలకు పైగా జనాభా గల సిటీకి కేవలం 6 ఐసీయూ బెడ్స్.. అమెరికాలో డెల్టా వేరియంట్ ‘విశ్వరూపం’

| Edited By: Phani CH

Aug 09, 2021 | 12:25 PM

అమెరికాలో మళ్ళీ కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. రోజుకు దాదాపు లక్షకు పైగా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క టెక్సాస్ రాష్ట్రాన్నే తీసుకుంటే.. ఇక్కడి ఆస్టిన్ సిటీ అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది.

Covid Cases: 20 లక్షలకు పైగా జనాభా గల సిటీకి  కేవలం 6 ఐసీయూ బెడ్స్.. అమెరికాలో డెల్టా వేరియంట్ విశ్వరూపం
Covid Cases
Follow us on

అమెరికాలో మళ్ళీ కోవిడ్ విశ్వరూపం చూపుతోంది. రోజుకు దాదాపు లక్షకు పైగా డెల్టా వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. ఒక్క టెక్సాస్ రాష్ట్రాన్నే తీసుకుంటే.. ఇక్కడి ఆస్టిన్ సిటీ అత్యంత దారుణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. సుమారు 24 లక్షలకు పైగా జనాభా గల ఈ సిటీలోని ఆసుపత్రుల్లో ఇప్పుడు కేవలం 6 ఐసీయూ బెడ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయని, ఇవి మాత్రం మిగిలాయని, రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక వెంటిలేటర్లు 313 ఉన్నాయని, హాస్పిటల్స్ అన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని పబ్లిక్ హెల్త్జ్ మెడికల్ డైరెక్టర్ డెస్మాల్ వేక్స్ తెలిపారు. పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉందని, రాబోయే రోజుల్లో మరింత విషమం కావచ్చునని ఆయన చెప్పారు. అందువల్లే ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజుల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని ఆయన చెప్పారు. కేసులు మరిన్ని పెరిగితే తామేమీ చేయలేమని ఆయన చేతులెత్తేశారు. నగర హెల్త్ డిపార్ట్ మెంట్ రిస్క్ లెవెల్ ని 5 కి పెంచింది. ప్రజలంతా వ్యాక్సిన్ తీసుకోవాలని, ఇళ్లలోనే ఉండాలని, వ్యాక్సిన్ తీసుకున్నా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఈ శాఖ సూచించింది.

గత నెల రోజుల్లో ఆస్పత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య 600 శాతం పైగా పెరగగా.. ఐసీయూలో అడ్మిట్ అవుతున్నవారి సంఖ్య 570 శాతానికి పెరిగింది.ఆస్టిన్ లో కోవిడ్ కేసులు 10 రెట్లు పెరిగాయని అంచనా.. హూస్టన్ లో 60 లక్షలపైగా జనాభా ఉండగా కేవలం 44 ఐసీయూ బెడ్స్ మాత్రమే మిగిలాయట.. 80 లక్షలకు పైగా జనాభా గల గ్రేటర్ డాలస్ లో 110 బెడ్స్ మాత్రం మిగిలాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కారణం వల్లే ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధ్యక్షుడు జోబైడెన్ మళ్ళీ ప్రకటించారు..

 

మరిన్ని ఇక్కడ చూడండి: పోరు ఉధృతం.. ఆఫ్ఘనిస్తాన్ లో మరో రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్న తాలిబన్లు

Smart Phones: రూ. పది వేల లోపు స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా.? అయితే బెస్ట్‌ ఫోన్‌లపై ఓ లుక్కేయండి..