Online Shopping: ఆన్లైన్ డెలివరీ బాక్స్ లో దుర్వాసన.. తెరిచి చూసి షాకైన కస్టమర్.. చివరకు ఏం జరిగిందంటే..
ప్రస్తుత జనరేషన్ మొత్తం కిరాణా సామానులు మొదలు బట్టల వరకూ.. ఎలాక్ట్రానిక్ వస్తువుల మొదలు గృహోపకరణ సామాగ్రి వరకూ ప్రతి ఒక్కటీ ఆన్లైన్ లోనే కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి ఆన్లైన్ షాపింగ్ చేసే వారికి వివిధ రకాలా ప్రత్యేక ఆఫర్లు అందిస్తూ ఉంటాయి. ఇలా కొందరు ఆన్లైన్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటే ప్రస్తుతం ఒకరు విచిత్రమైన అనుభూతిని ఎదుర్కొన్నారు. ఎవరూ ఊహించని సరికొత్త పరిణామం చోటు చేసుకుంది. ఇది కొంచెం చెడు అనుభూతిని కలిగించేలా ఉంది.

ఇంగ్లాండ్ లోని బ్లాక్ బర్న్ కి చెందిన 55 ఏళ్ల స్మిత్ అనే వ్యక్తికి ఒక చేదు అనుభవం ఎదురైంది. రూ. 15,000 విలువ గల కిరాణా వస్తువులను ఆర్డర్ చేశారు. అవి తనకు సకాలంలో ఇంటికి డెలివరీ అయింది. డెలివరీ చేసిన ప్యాకెట్ ను తెలిచి చూస్తే ఒక రకమైన చెడు వాసన రావడాన్ని గమనించాడు స్మిత్. ప్యాకెట్ పూర్తిగా తెరచి చూశాడు. దుర్వాసన తీవ్రత మరింత ఎక్కువ అయింది. తీరా ప్యాకించే చేసిన బ్యాగ్ పూర్తిగా ఓపెన్ చేస్తే అందులో మనవ సంబంధింత విసర్జితాలు దర్శనమిచ్చాయి. దీనిని చూసిన బాధితుడు ఒక్కసారిగా కంగు తిన్నారు.
ఆ బ్యాగ్ లోని మిగిలిన వాటిని పరిశీలిస్తే అదే రకమైన దుర్వాసన వెదజల్లింది. దీంతో ఆగ్రహానికి గురైయ్యాడు స్మిత్. వెంటనే డెలివరీ చేసిన సంస్థ టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేశాడు. ఆర్డర్ చేసిన తరువాత వచ్చిన వస్తువుల ప్యాకింగ్ ని తెరచి చూసినప్పుడు అతనికి కలిగిన అనుభూతిని కంపెనీ వాళ్లతో పంచుకున్నాడు. వెంటనే తన ఇంటిని శభ్రం చేసేందుకు వ్యక్తిని పంపించాలని కోరాడు. దీనిపై స్పందించని డెలివరీ సంస్థపై మరింత రెచ్చిపోయాడు. తనకు రీఫండ్ కావాలని కోరాడు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో డెలివరీ కంపెనీని విచారించేందుకు హెల్త్ ఇన్ స్పెక్టర్ రంగంలోకి దిగారు. మలమూత్రాలతో కూడిన ప్యాకెట్ పై విచారణ జరిపేందుకు సిద్దమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ డెలివరీ బాయ్ పై అనుమానం రావడంతో వెంటనే అతనిని విధుల నుంచి తొలగించారు. ఇలాంటి సంఘటనలు కొత్తేమీ కాదని తేల్చారు పోలీసులు. గతంలో ఒక డెలివరీ బాయ్ జంతువుల అవశేశాలతో కూడిన ప్యాకెట్ ను డెలివరీ చేసినట్లు తెలిపారు. అలాగే కొత్తగా అందించాల్సిన షూకి బదులు పాతవి, దుర్వాసన వచ్చే వాటిని డెలివరీ చేసిన ఉదంతాలను తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..