Afterlife Journey: యాక్సిడెంట్‌లో తాత్కాలికంగా మరణించి స్వర్గ, నరకాలను చూశానంటున్న రిటైర్డ్ పోలీసు అధికారి.. ఎక్కడంటే

| Edited By: Surya Kala

Jul 13, 2021 | 1:22 PM

Afterlife Journey: మరణం తర్వాత మనిషి ప్రయాణం.. ఎప్పుడూ తీరని.. తీర్చలేని సందేహమే.. ఒకొక్క మతంలో.. మరణం తర్వాత మనిషి జీవితం గురించి ఒకొక్క నమ్మకం.. అయితే మరణం తర్వాత..

Afterlife Journey: యాక్సిడెంట్‌లో తాత్కాలికంగా మరణించి స్వర్గ, నరకాలను చూశానంటున్న రిటైర్డ్ పోలీసు అధికారి.. ఎక్కడంటే
Afterlife Journey
Follow us on

Afterlife Journey: మరణం తర్వాత మనిషి ప్రయాణం.. ఎప్పుడూ తీరని.. తీర్చలేని సందేహమే.. ఒకొక్క మతంలో.. మరణం తర్వాత మనిషి జీవితం గురించి ఒకొక్క నమ్మకం.. అయితే మరణం తర్వాత మనిషి తాను చేసిన పనులను బట్టి స్వర్గ, నరకాలను చేరుకుంటాడు అని ఆధ్యాత్మికవేత్తల నమ్మకం. అయితే ఈ నమ్మకానికి నేను సాక్షం అంటున్నాడు ఒక మాజీ పోలీసు అధికారి. తాను కారు ప్రమాదానికి గురైన సమయంలో తాత్కలికంగా మరణించి నరకానికి వెళ్లి.. సందర్శించి తిరిగి వచ్చానని చెప్పిన మాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఘోరమైన కారు ప్రమాదంలో రిటైర్డ్ పోలీసు అధికారి జెఫ్ కౌల్టర్ కోమాలోకి వెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో అతను స్వర్గ, నరకాలను చూశాడు. తన కారు 2014 లో మరొ కారుని ఢీ కొనడంతో తాను తాత్కాలికంగా మరణించానని.. అప్పుడు మరణం తర్వాత మనిషి జీవితం ఏమిటో చూశానని జెఫ్ కౌల్టర్ చెప్పారు. తన కారుకు యాక్సిడెంట్ ఐన సమయంలో పేలుడు సంభవించిందని.. అప్పుడు తాను తీవ్రంగా గాయపడడంతో.. అమెరికా పోలీసులు ఒహియోలో సిన్సినాటి లోని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అంతేకాదు. కారు ప్రమాదం జరిగిన సమయంలో . కారు పిచ్ బ్లాక్ వద్ద ఎవరివో మాటలు అస్పష్టంగా విన్నానని అతను చెప్పారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జెఫ్ కౌల్టర్ గుండె ఆగిపోయింది. అప్పుడు తన ఆత్మ తన శరీరాన్ని విడిచిపెట్టినట్లు పేర్కొన్నాడు. తన ఆత్మ ఆలా ప్రయాణిస్తూ.. స్వర్గాన్ని, నరకాన్ని సందర్శించినట్లు చెప్పాడు.

యాక్సిండెంట్ లో భార్య చేతిలో మూర్చబోయిన నేను దెయ్యాలను చూడడం.. వాటి కేకలు, నవ్వులు వినడం వంటివి వినబడ్డాయని తెలిపారు. ఆ తరువాత, నా గుండె ఆగిపోయింది, నా శ్వాస బందించబడింది. దీంతో నేను ప్రాథమికంగా చనిపోతున్నానని నాకు ముందస్తు సిగ్నల్ ఇచ్చింది. అయితే ఆస్పత్రిలో వైద్యులు ఎమర్జెనీ ఆపరేషన్ చేసి.. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకుని వచ్చారని తెలిపాడు. అంతేకాదు.. మరణానంతరం తాను చేసిన ప్రయాణంలో మరో గ్రహంలో గ్రహాంతర వాసులను చూసినట్లు.. అప్పుడు తన తల్లి కూడా కనిపించిందని గుర్తు చేసుకున్నారు. తన తల్లి తనను గుర్తించింది… చేతులు కడుపుటూ ఏవో సిగ్నల్స్ కూడా ఇచ్చింది స్పష్టం చేశారు జెఫ్

Also Read: వ్యాయామం చేసేటప్పుడు ఎక్కువగా ఆవలింతలు వస్తే.. మీ ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిందే..