జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వల్ల పక్షవాతం ..? యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వార్నింగ్ !
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చుక్కెదురుగానా అన్నట్టు అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్రేషన్ ( ఎఫ్డీఏ) ఓ కొత్త హెచ్చరికజారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందు కారణంగా కొన్ని కేసుల్లో నాడీ సంబంధ రుగ్మతలు (పెరాలిసిస్ వంటివి) తలెత్తవచ్చునని
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు చుక్కెదురుగానా అన్నట్టు అమెరికా లోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్రేషన్ ( ఎఫ్డీఏ) ఓ కొత్త హెచ్చరికజారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకామందు కారణంగా కొన్ని కేసుల్లో నాడీ సంబంధ రుగ్మతలు (పెరాలిసిస్ వంటివి) తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయంటూనే..దీన్ని ‘ గులియెన్ బేర్’ సిండ్రోమ్ పేరిట వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఇవి ఎంత సూత్ర ప్రాయమైన వార్తలైనప్పటికీ జాన్సన్ అండ్ జాన్సన్కంపెనీ ట్రబుల్ లో పడినట్టు భావిస్తున్నారు. అయితే మోడెర్నా, ఫైజర్ టీకా మందుల విషయంలో ఈ సమస్య లేదని, ఒక్క జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ లోనే ఇది ఉన్నట్టు గుర్తించామని ఈ సంస్థ ఓ స్టేట్ మెంట్ లో తెలిపింది. అమెరికాలో 12.8 మిలియన్లమందికి పైగా ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు.
వీరిలో వంద గులియెన్ బేర్ సిండ్రోమ్ కేసుల తాలూకు రిపోర్టులు యూఎస్ ఎడ్వర్స్ రిపోర్టింగ్ సిస్టంకు అందాయి. వివిధ వ్యాక్సిన్ల సామర్థ్యం, నాణ్యత తదితరాలను ఈ సిస్టం పర్యవేక్క్షిస్తుంటుంది. ఈ సిండ్రోమ్ లో నాడుల వ్యవస్థ బలహీనమవుతుందని, కండరాలు, నాడుల బలహీనత కారణంగా పక్షవాత లక్షణాలు..అలాగే సరిగా నడవలేకపోవడం, కొన్ని కేసుల్లో సరిగా మాట్లాడలేకపోవడం, ఆహార పదార్థాలు మింగలేకపోవడం, దృష్టి లోపం వంటి వివిధ రుగ్మతలు తలెత్తవచ్చునని ఈ సంస్థ పేర్కొంది. ఏ మాత్రం ఈ విధమైన లక్షణాలు కనబడినా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ విషయమై ఇండియాలో ఇప్పటివరకు ఏ నిపుణుడూ ఇలా ప్రమాదకరమైన హెచ్చరిక చేయలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి : ఆయన హీరో ప్రభాస్ అనుకుంటున్నారు!రేవంత్ రెడ్డి పై కామెంట్స్ చేసిన కౌశిక్ రెడ్డి..(వీడియో).:Koushik Reddy on Revanth Reddy Video.