China Protesters: ప్రభుత్వంపై సమరానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్న చైనీయులు.. డేటింగ్, టెలిగ్రామ్ యాప్ లతో..

|

Nov 29, 2022 | 8:17 PM

చైనాలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నిరసనకారుల వీడియోలు, ఫోటోలు , ఖాతాల సంఖ్య భారీ పెరుగుతోంది. గత వారం నుంచి ఈ పెరుగుదల గణనీయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మూసివేయబోతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను  నిరసనకారులు ముందుగా ఎంచుకుని.. తమ వ్యూహాన్ని వ్యాప్తి  చేస్తున్నారు. 

China Protesters: ప్రభుత్వంపై సమరానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకుంటున్న చైనీయులు.. డేటింగ్, టెలిగ్రామ్ యాప్ లతో..
China Corona
Follow us on

మనదేశంతో సహా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు కరోనా నుంచి బయటపడ్డాయి.. అయితే కరోనా పుట్టిల్లు చైనాలో మాత్రం పరిస్థితిలు భిన్నంగా ఉన్నాయి. చైనాలో మళ్ళీ కరోనా విజృంభిస్తోండడంతో..  ప్రభుత్వం నివారణ చర్యల్లో భాగంగా అనేక నగరాల్లో లాక్‌డౌన్‌ను విధించింది. అయితే ఈ కరోనా లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా ప్రజలు గళం విప్పారు.. పుర వీధుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కదం తొక్కుతున్నారు. దీంతో నిరసన కారులను అదుపు చేసేందుకు ప్రభుత్వం పోలీసులను కూడా రంగంలోకి దింపింది. అయితే చైనా ప్రజలు ఇప్పుడు తమ వ్యూహాన్ని ఒకరికొకరు చెప్పుకోవడానికి డేటింగ్ యాప్, టెలిగ్రామ్‌తో సహా ఇతర యాప్‌లను ఆశ్రయిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. చైనాలోని చాలా ప్రదేశాల్లో ఈ డేటింగ్ యాప్‌లపై నిషేధం ఉంది. అయినప్పటికీ ప్రజలు సెన్సార్‌కు ముందే ఇలాంటి యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రజలు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి , తమ నిరసన వ్యూహాన్ని వ్యాప్తి చేయడానికి ఈ యాప్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

మీడియా నివేదికల ప్రకారం.. చైనాలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో నిరసనకారుల వీడియోలు, ఫోటోలు , ఖాతాల సంఖ్య భారీ పెరుగుతోంది. గత వారం నుంచి ఈ పెరుగుదల గణనీయంగా కనిపిస్తోంది. ప్రభుత్వం మూసివేయబోతున్న సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను  నిరసనకారులు ముందుగా ఎంచుకుని.. తమ వ్యూహాన్ని వ్యాప్తి  చేస్తున్నారు.

నిరసనకారులు Weibo , Douyin వంటి సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం ఈ యాప్‌లన్నింటినీ సెన్సార్‌షిప్‌ పరిధిలోకి తెస్తోంది. అయితే అంతకుముందే ప్రజలు వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా ప్రజలు తమ ఇళ్లలో బంధించబడ్డారు అనడాన్ని ప్రభుత్వం ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న ఈ కథనాలు నిరాధారమైనవని ప్రభుత్వం పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..