Cryptocurrency Fraud: దాదాపు రూ.31వేల కోట్ల విలువైన క్రిప్టో కరెన్సీ కుంభకోణం చేసిందనే ఆరోపణతో ఓ మహిళ కోసం అమెరికా గాలింపు చర్యలు చేపడుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) టాప్ మోస్ట్‌వాంటెడ్ జాబితాలో ఆమెను చేర్చింది. ఇంత మోసానికి పాల్పడిన ఆమె ఆచూకీ చెప్పిన వారికి సుమారు లక్ష డాలర్లు బహుమతిగా అందిస్తామని ప్రకటించింది.
బల్గేరియాకు చెందిన రుహా ఇగ్నాసివ, ‘వన్ కాయిన్’ పేరుతో 2014లో క్రిప్టో కరెన్సీ తీసుకువచ్చినట్లు ప్రకటించారు. అయితే వన్ కాయిన్‌ను విక్రయించిన వారికి కమిషన్లు ఇచ్చారు. వన్ కాయిన్ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు అంటే రూ.31వేల కోట్లు పొగేసుకుని రుహా ఇగ్నాసివ బోర్డు తిప్పేసినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు.
2017 నుంచి రుహా ఇగ్నాసివక నిపించకుండా పారిపోయారు. వన్ కాయిన్‌కు అసలు విలే లేదని, ఇతర క్రిప్టో కరెన్సీల మాదిరిగానే బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని రూపొందించలేదని ఎఫ్‌బీఐ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి