Elon Musk: గత రెండేళ్లకు పైగా కరోనా మహమ్మారి విజృంభించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. థర్డ్‌వేవ్ ముగిసి జూన్‌లో ఫోర్త్ వేవ్ ప్రారంభం కానున్నట్లు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక కరోనా సామాన్యుడి నుంచి ప్రముఖల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. ఇక టెస్లా సీఈఓ ఎలాన్ మాస్క్ మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించనప్పటికీ తనకు మళ్లీ కోవిడ్ సోకిందని ట్వీట్ చేచేశారు. అయితే ఎలాన్ మాస్క్‌కు కరోనా సోకడం ఇది రెండోసారి. 2020 నవంబర్ నెలలో తనకు కరోనా సోకిందని వెల్లడించారు. ఆ సమయంలో కోవిడ్ పరీక్షలపై అనుమానం వ్యక్తం చేశారు. అసలు కచ్చితమైన ఫలితాలు ఇస్తున్నాయా ? అంటూ ప్రశ్నించారు. తాజాగా మరోసారి కోవిడ్ సోకినట్లు ట్వీట్ చేశారు.
నేను మళ్లీ వైరస్ బారిన పడ్డాను. కానీ ఎలాంటి లక్షణాల లేవు అని ఎలాన్ మాస్క్ అన్నారు. గతంలో కరోనా బారిన పడిన సమయంలోనూ భిన్నంగా స్పందించిన మాస్క్ నిర్ధారణ పరీక్షలు కచ్చితంగా వస్తున్నాయా అంటూ అనుమానం వ్యక్తం చేశారు. కాగా, కరోనా మమహ్మారి కారణంగా ప్రతి ఒక్కరికి రెండు వ్యాక్సిన్ డోసులు తప్పనిసరి చేసిన విషయంలో కూడా ఎలాన్ మాస్క్ స్పందించారు. రెండో డోసు తప్పనిసరి చేయడాన్ని ఆయన మొదట్లో వ్యతిరేకించారు. నిపుణుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో స్పందించిన ఎలాన్ మాస్క్.. తాను, తన కుటుంబ సభ్యులు వ్యాక్సిన్ తీసుకున్నామని చెప్పుకొచ్చారు.
Covid-19 is the virus of Theseus.
How many gene changes before it’s not Covid-19 anymore?
I supposedly have it again (sigh), but almost no symptoms.
— Elon Musk (@elonmusk) March 28, 2022
ఇవి కూడా చదవండి: