కరోనా పుట్టినిల్లు చైనాలో మరోసారి ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. వెలుగులోకి వచ్చినది మొదలు కరోనా మహమ్మారి రకరకాల రూపాలను సంతరించుకుని మానవాళిని భయబ్రాంతులకు గురి చేశాయి. ఇప్పుడిప్పుడే ప్రజలు కరోనా భయం నుంచి తేరుకుంటున్న సమయంలో డ్రాగన్ కంట్రీలో మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. అవును కరోనా వైరస్ కొత్త రూపం సంతరించుకుని XBB వేరియంట్స్ (XBB. 1.9.1, XBB. 1.5, XBB. 1.16)గా అభివృద్ధి చెందుతుందని.. ఈ వైరస్ రోగనిరోధక శక్తిని నిర్వీర్యం చేస్తుందని చైనా అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ఈ వైరస్ కొత్త XBB రకాల వ్యాప్తి జూన్‌లో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని.. వారానికి 65 మిలియన్ల మందికి సోకుతుందని చైనా అధికారులు అంచనా వేశారు. ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కోవడానికి చైనా అధికారులు వ్యాక్సిన్ కోసం పరుగులు పెడుతున్నారు.
గత సంవత్సరం “జీరో కోవిడ్” విధానానికి చైనా ఆకస్మికంగా గుడ్ బై చెప్పిన తర్వాత కరోనా వ్యాప్తి భారీగా పెరిగినట్లు ది వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది. ఈ కొత్త వేరియంట్ ను ఎదుర్కొనేందుకు ప్రముఖ చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ ఝాంగ్ నాన్షాన్ కొత్త వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ వలన జనాభాలో వృద్ధుల మరణాల పెరుగుదలను నివారించడానికి శక్తిమంతమైన టీకా బూస్టర్ తో పాటు యాంటీ వైరల్ మెడిసిన్స్ ను సిద్ధం చేయాలని చైనా ప్రభుత్వం భావిస్తుంది.
గత నెలలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయని ఏప్రిల్ చివరి నుంచి ఈ కేసుల సంఖ్య వీపరీతంగా పెరగడం ప్రారంభమైందని వెల్లడించిందని బీజింగ్ సెంట్రల్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. ఈ కొత్త వేరియంట్ వలన తీవ్ర ఇబ్బందులు ఉండవని.. మరణాలు కూడా తక్కువగా ఉంటాయని.. శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ఈ కొత్త వేరియంట్ వలన ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ XBBను ఎదుర్కోవడానికి వైద్య సదుపాయాలపై దృష్టిని సారించారు. మాస్క్ లు తప్పని సరిగా ధరించాలని.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు రద్దీ ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..