కరోనా భయమా..? చైనాపై అతి నమ్మకమా..? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ డేరింగ్ స్టెప్..!

ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటాన్నారో అందరికీ తెలిసిందే. కరోనా నివారణలో

కరోనా భయమా..? చైనాపై అతి నమ్మకమా..? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్ డేరింగ్ స్టెప్..!
Kim Jong-un
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 02, 2020 | 7:10 AM

ఉత్తర కొరియాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటాన్నారో అందరికీ తెలిసిందే. కరోనా నివారణలో అలసత్వం వహించే అధికారులకు ఏకంగా మరణదండన విధిస్తున్నారనే వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ తనకు ఎక్కడ సోకుతుందోనని ఆందోళనలో ఉన్న కిమ్ జోంగ్ ఉన్.. ఇంకా ప్రయోగదశలోనే ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను వేయించుకున్నారట. ఆయన మాత్రమే కాదు.. ఆయన కుటుంబ సభ్యులకు, ఆదేశ ఉన్నతాధికారులకూ ఈ వ్యాక్సిన్ ఇప్పటించారట. ఈ విషయాన్ని అమెరికాలోని సెంటర్ ఫర్ ది నేషనల్ ఇంట్రస్ట్‌కు చెందిన నిపుణుడు హ్యారీ కాజియానిస్ వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ చైనాకు చెందినదిగా వెల్లడించిన ఆయన.. ఔషధ కంపెనీ పేరుపై మాత్రం క్లారిటీ లేదన్నారు. ప్రస్తుతం చైనాలో ఏ వ్యాక్సిన్ కూడా అధికారికంగా వినియోగంలోకి రాలేదు. ఇలాంటి తరుణంలో చైనాకు చెందిన వ్యాక్సిన్‌ ప్రయోగదశలో ఉండగానే కిమ్ తనకు వేయించుకున్నాడంటే చాలా ధైర్యం చేశాడనే చెప్పాలి. చైనాపై ఉన్న నమ్మకమే కిమ్‌కు ఆ ధైర్యాన్ని కల్పించిందని వైద్య నిపుణులు అంటున్నారు.

హ్యారీ చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ‘చైనాలో మొత్తం మూడు ఔషధ కంపెనీలు కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను తయారు చేస్తున్నాయి. ఈ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్‌ను సప్లయ్ చేసేందుకు చైనా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే ఏ వ్యాక్సిన్ వినియోగానికీ ఇప్పటి వరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి అనుమతులు రాలేదు. కిమ్‌కు వేసిన వ్యాక్సిన్ ఏ ఔషధ సంస్థ తయారు చేసిందనే విషయంపై స్పష్టత లేదు. ఈ వ్యాక్సిన్ సురక్షితమా? కాదా? అన్న దానిపైనా క్లారిటీ లేదు. ఈ వ్యాక్సిన్లను చైనాలో అధికారికంగా వినియోగిస్తున్నారు. సినోఫ్రమ్ నుంచి వచ్చిన వ్యాక్సిన్‌ను ఇప్పటికే 10 లక్షల మంది చైనీయులకు ఇచ్చారు.’ అని హ్యారీ చెప్పుకొచ్చారు.