Lockdown News: విజృంభిస్తున్న కరోనా కొత్త వేవ్.. ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్

|

Nov 19, 2021 | 5:49 PM

కరోనా కేసులు భారత్‌లో కట్టడిలోకి వచ్చినా పలు దేశాల్లో ఇంకా హడలెత్తిస్తూనే ఉంది. యూరఫ్‌లో కొత్త వేవ్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Lockdown News: విజృంభిస్తున్న కరోనా కొత్త వేవ్.. ఆ దేశంలో మళ్లీ పూర్తిస్థాయి లాక్‌డౌన్
Coronavirus
Follow us on

కరోనా కేసులు భారత్‌లో కట్టడిలోకి వచ్చినా పలు దేశాల్లో ఇంకా హడలెత్తిస్తూనే ఉంది. యూరఫ్‌లో కొత్త వేవ్ కారణంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పశ్చిమ యూరప్‌లోని ఆస్ట్రియాలో దేశ వ్యాప్త కోవిడ్-19 లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఆ మేరకు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండర్ ఛల్లెన్‌బెర్గ్ శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల కాలంలో కరోనా వైరస్ కొత్త వేవ్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధిస్తున్న దేశం ఆస్ట్రియానే కావడం విశేషం.

సోమవారం నుంచి మొదలుకానున్న దేశ వ్యాప్త లాక్‌డౌన్.. గరిష్ఠంగా 20 రోజుల పాటు అమలులో ఉండే అవకాశముందని ఛాన్సెలర్ తెలిపారు. ప్రతి 10 రోజులకూ దేశంలో కరోనా పరిస్థితిని సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. డిసెంబరు 13తో వ్యాక్సిన్ వేసుకున్న వారు, కోవిడ్ నుంచి కోలుకున్న వారికి లాక్‌డౌన్ ముగిసిపోతుందని, దాని తర్వాత లాక్‌డౌన్ ఉండబోదని స్పష్టంచేశారు. కాగా దేశంలో తప్పనిసరి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని 2022 ఫిబ్రవరి 1 నుంచి చేపట్టనున్నట్లు వెల్లడించారు.

పశ్చిమ యూరప్‌లోనే అత్యధికంగా ఆస్ట్రియాలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో ఆ దేశంలో లక్ష మందిలో 991 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఇంకా వాక్సిన్ తీసుకోని వారికి ఆ దేశంలో గత సోమవారం నుంచే లాక్‌డౌన్ అమలుచేస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా ఆ దేశంలో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.

Also Read..

MLA Roja: నాకు చాలా సంతోషంగా ఉంది.. బైబై బాబూ అంటూ రోజా సంచలన వీడియో

Nayanthara: నయన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదుగా.. గాడ్ ఫాదర్ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ ?..