ఆ అంశంపై ప్రత్యేక కోర్సు.. విద్యార్థులతో పాటు లెక్చరర్లూ వీడియోలు చూసేలా.. ఇంతకీ ఎక్కడంటే

|

Apr 24, 2022 | 3:44 PM

లైంగిక విద్య పట్ల అవగాహన కలిగించేందుకు అమెరికాలోని ఓ కాలేజీ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్నోగ్రఫీపై ప్రత్యక కోర్సును ప్రవేశపెట్టింది. 2022–23 విద్యా సంవత్సరంలో ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని ఉటాలోని వెస్ట్‌ మినిస్టర్‌ కాలేజీ....

ఆ అంశంపై ప్రత్యేక కోర్సు.. విద్యార్థులతో పాటు లెక్చరర్లూ వీడియోలు చూసేలా.. ఇంతకీ ఎక్కడంటే
america
Follow us on

లైంగిక విద్య పట్ల అవగాహన కలిగించేందుకు అమెరికాలోని ఓ కాలేజీ కీలక నిర్ణయం తీసుకుంది. పోర్నోగ్రఫీపై ప్రత్యక కోర్సును ప్రవేశపెట్టింది. 2022–23 విద్యా సంవత్సరంలో ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని ఉటాలోని వెస్ట్‌ మినిస్టర్‌ కాలేజీ ప్రకటించింది. లైంగికావయవాలను గురించి, వివిధ రకాల లైంగిక చర్యల గురించి ఈ కోర్సులో బోధిస్తామని, తద్వారా వాటి పట్ల ఉన్న వ్యతిరేక భావనను తొలగించే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ కోర్సులో భాగంగా లెక్చరర్లు, విద్యార్థులు తరగతి గదిలోనే కలిసి కూర్చుని పోర్న్‌ వీడియోలు చూస్తూ.. స్త్రీ, పురుష లైంగిక సంబంధాలపై జాతి, వర్గం, లింగ విభేదాల ప్రభావం గురించి చర్చలు జరుపుతారని తెలిపింది. సామాజిక అంశాలను విశ్లేషించేందుకు, వివాదాస్పద అంశాలపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇది ఒక అవకాశంగా ఉంటుందని పేర్కొంది.

విద్యార్థులు, ఉపాధ్యాయులు తరగతి గదిలో అశ్లీల చిత్రాలను కలిసి చూడటం చాలా అసహ్యకరమైన వ్యవహారమంటూ కళాశాల తీరుపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కోర్సులు ప్రవేశపెడితే విద్యార్థులను తప్పుదారి పట్టించినట్లే అవుతుందని విమర్శిస్తున్నారు. థియరీ పరంగా బోధిస్తే చాలని, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పోర్న్ చూస్తే తీవ్ర పరిణామాలు తలెత్తుతాయని మండిపడుతున్నారు. వెంటనే ఈ కోర్సును తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏది ఏమైనా ఈ కోర్సును ప్రారంభించి తీరుతామని వెస్ట్ మినిస్టర్ కాలేజీ ప్రకటించడం గమనార్హం.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లక్ చేయండి

Also Read: ప్రియాంక గాంధీ నుండి ఆ పెయింటింగ్‌ను రూ.2కోట్లకు బలవంతంగా కొనిపించారు.. ED ఛార్జిషీట్‌లో రాణా కపూర్

Viral Video: కదులుతున్న వాహనం నుండి దూకిన వ్యక్తి.. షాకింగ్, డేంజరస్ స్టంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్