America President: తస్మాత్ జాగ్రత్త.. లైట్ తీసుకుంటే చైనా మన భోజనాన్ని కూడా తినేస్తుంది.. బైడెన్ వార్నింగ్..

|

Feb 12, 2021 | 3:43 PM

merica President Joe Biden: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ చైనా పట్ల గుర్రుగా ఉన్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా..

America President: తస్మాత్ జాగ్రత్త.. లైట్ తీసుకుంటే చైనా మన భోజనాన్ని కూడా తినేస్తుంది.. బైడెన్ వార్నింగ్..
Follow us on

America President Joe Biden: అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ చైనా పట్ల గుర్రుగా ఉన్నారు. ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. తాజా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశ ప్రధాన అధికారులతో సమావేశం అయ్యారు. ఆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. చైనా విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తే మనం తినే తిండిని కూడా లాగేసుకుంటుందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత తొలిసారి జో బైడెన్ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య తీవ్రమైన చర్చ జరిగినట్లు వార్తలు గుప్పుమంటన్నాయి. అయితే చైనా అధినేతతో ఫోన్ తరువాత జో బైడెన్ వైట్ హౌస్ అధికారులతో సమావేశం అయ్యారు. ఇకనైనా మనం ముందడుగు వేయకపోతే చైనా మన ఆహారాన్ని సైతం తినేస్తుందంటూ వ్యాఖ్యానించారు. ‘వారు ట్రాన్స్‌పోర్ట్, సాంకేతిక పరిజ్ఞానం, మౌళిక వసతులు, పర్యావరణం, తదితరాలపై బిలియన్ల కొద్ది పెట్టుబడులు పెడుతున్నారు’ అని బైడెన్ ఉటంకించారు.

ఇకనైనా ముందడుగు వేయాలి అని అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. చైనా తమకు వ్యూహాత్మక ప్రత్యర్థి అని పేర్కొన్న బైడెన్.. ఫసిఫిక్-ఇండో ప్రాంతాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇదే సమయంలో చైనాకు సంబంధించిన పలు అంశాలపై జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా అనుసరిస్తున్న బలవంతపు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, హాంకాంగ్‌లో అణచివేతలు, గ్జిన్‌జియాంగ్‌లో ముస్లిం వర్గాలపై ఉక్కుపాదం మోపడం, తైవాన్ సహా చిన్న చిన్న దేశాలపై చైనా దురాక్రమణకు పాల్పడటం వంటి అంశాలపై బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ పట్ల చైనా వ్యవహరాశైలిపై బైడెన్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వైట్ హౌస్ ప్రతినిధి జెన్‌సాకి వెల్లడించారు.

Also read:

Wangala Lady Constable: మొదటి జీతం అందుకుని పది మంది ఆకలి తీర్చిన మహిళా కానిస్టేబుల్ .. ఎక్కడంటే..!

Oranges : మీరు నారింజపండ్లను తింటున్నారా.. అయితే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..