అటు.. అమెరికా ప్రెసిడెంట్‌గా బైడెన్ ప్రమాణస్వీకారం.. కొద్దిసేపటికే ఇటు.. చైనా సంచలన నిర్ణయం..!
మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది.
China shocking Decision : అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిముషాలకే చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కేబినెట్‌లో కీలక పాత్ర పోషించిన మైక్ పాంపియోతో పాటు మరో 27 మంది నేతలపై అంక్షలు విధించింది. వీరెవరూ తమ దేశంలో అడుగుపెట్టకుండా చైనా నిషేధం విధించింది. అంతేకాదు వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా చైనా ప్రధాన భూభాగంలో కానీ, హాంకాంగ్‌లో కానీ, మకావూలో కానీ అడుగుపెట్టకూడదంటూ ఆల్టిమేటం జారీ చేసింది. వ్యక్తిగత పనులతో పాటు వ్యాపార కార్యకలాపాల కోసం కూడా వారిని తమ దేశంలో రానివ్వబోమని ప్రకటించింది.
Read Also… దేశంలో చురుకుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రులకు వ్యాక్సిన్