దేశంలో చురుకుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రులకు వ్యాక్సిన్

రెండో దశలో జరిగే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీకా వేయించుకోనున్నారు.

దేశంలో చురుకుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ.. రెండో దశలో ప్రధాని, ముఖ్యమంత్రులకు వ్యాక్సిన్
Follow us

|

Updated on: Jan 22, 2021 | 7:11 PM

Second phase of vaccination: దేశవ్యాప్తంగా కోవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంగా చురుకుగా సాగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 10లక్షల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. వివిధ స్థాయిలలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రెండో దశలో జరిగే కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీకా వేయించుకోనున్నారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ జాబితాలో ఉన్నారు.

ప్రధాని సహా ముఖ్య నేతలకు రెండో దశలో టీకా వేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. అలాగే, 50 ఏళ్ల వయసు పైబడిన వారికీ కోవిడ్ టీకా అందజేస్తామని తెలిపింది. రెండో దశలో తొలిరోజు ప్రధాని, ముఖ్యమంత్రులకు టీకాలు ఇవ్వనున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ప్రధాని మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో టీకా వేయించుకున్న లబ్ధిదారులతో మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో ఈ కార్యక్రమం జరగనుంది. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగమైన ప్రజలు.. వారి అనుభవాలను మోదీతో పంచుకున్నారు. రాజకీయ నాయకులు టీకా కోసం క్యూలో దూకకూడదని ప్రధాని మోదీ అన్నారు. మొదటి విడతలో ఆరోగ్య సిబ్బందితో పాటు ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఇదిలావుంటే, ప్రధాని కోవిషీల్డ్‌ను తీసుకుంటారా లేక కోవాక్సిన్ తీసుకుంటారా అనేది స్పష్టం కాలేదు.

Read Also… COVID-19 Vaccination : 7 రోజుల్లో పది లక్షలకు పైగా వ్యాక్సిన్లు… కర్ణాటక టాప్.. రెండోస్థానంలో ఆంధ్రప్రదేశ్