China: ఆహారం తెచ్చుకునేందుకు నో ఛాన్స్.. మెడిసిన్స్ కావాలంటే అనుమతులు తప్పనిసరి
చైనా(China) లో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసులతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దీంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్యను తగ్గంచేందుకు అక్కడి....
చైనా(China) లో కరోనా మహమ్మారి ప్రభావం అధికంగా ఉంది. రోజురోజుకు నమోదవుతున్న కొత్త కేసులతో డ్రాగన్ దేశం అతలాకుతలమవుతోంది. దీంతో ఆ దేశంలో కరోనా కేసుల సంఖ్యను తగ్గంచేందుకు అక్కడి ప్రభుత్వం ఆంక్షలను కఠినం చేసింది. జీరో కొవిడ్(Zero Covid in Shanghai) లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో షాంఘై నగరంలో కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పటికే ఆహారం, మందులు కొనుగోలుకు, హాస్పిటల్స్ కు వెళ్లేందుకు అనుమతిస్తున్న చైనా.. రాబోయే రోజుల్లో వాటికీ అనుమతి ఇచ్చే అవకాశం ఇవ్వని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నగరంలోని ఈ ప్రాంతాల్లో ఆహార సరఫరా సేవలనూ నిలిపేయాలని నిర్ణయించింది. వైద్యశాలల్లో కూడా ఎమర్జెన్సీ సేవలకు మాత్రమే తొలి ప్రాధాన్యమివ్వనుంది. చైనా ఆర్థిక రాజధాని షాంఘైలో కరోనా ఆంక్షలు విధించి ఏడు వారాలు అవుతోంది. అధికారులు మాత్రం తమ లక్ష్యంగా ఉన్న ‘సొసైటల్ జీరో’ను అందుకోలేకపోతున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిలో తప్ప బయట ఎక్కడా కొత్త కొవిడ్ కేసు రాకూడదనేది ‘సొసైటల్ జీరో’ లక్ష్యం. మరోపక్క వైద్య సిబ్బంది నగరంలోని కీలక ప్రాంతాలకు వెళ్లి, బాధితులతో కలిసి ఫొటోలు దిగిన చిత్రాలను చైనా మీడియా ప్రచారం చేస్తోంది.
సైలెంట్ పీరియడ్ పేరిట కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. ఈ నిబంధనలను మరో మూడు రోజులు అమలు చేయనుంది. దీనిలో కేవలం ప్రభుత్వ ఆహార సరఫరాలను మాత్రమే అనుమతిస్తారు. అంతేకాకుండా ఎమర్జెన్సీ కేసులు కాకుండా ఎవరైనా వైద్యశాలలకు వెళ్లాలంటే కమిటీ నుంచి అనుమతులు తెచ్చుకోవాలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా కొవిడ్ బాధితులతో సన్నిహితంగా ఉన్న వారిని బలవంతంగా సెంట్రల్ క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వారి ఇళ్లను డిస్‌ఇన్ఫెక్ట్ చేయడానికి ఇంటి తాళాలను తలుపుల వద్ద ఉంచాలని అధికారులు సూచిస్తున్నారు. దీనిపై స్థానికుల్లో కొంత వ్యతిరేకత కనిపిస్తోంది.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి
Andhra Pradesh: టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం కక్ష గట్టింది.. నారా లోకేశ్ ఆగ్రహం