Fire Accident: అండర్‌గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం..9 మంది మృతి

|

Jan 02, 2022 | 3:17 PM

Fire Accident: అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షాట్‌ సర్క్యూట్‌, ప్రమాదవశాత్తు, ఇతర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ మొత్తంలో..

Fire Accident: అండర్‌గ్రౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం..9 మంది మృతి
Follow us on

Fire Accident: అగ్నిప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. షాట్‌ సర్క్యూట్‌, ప్రమాదవశాత్తు, ఇతర కారణాల వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుని భారీ మొత్తంలో ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇక చైనాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భూగర్భ ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో 9 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఈ భారీ అగ్ని ప్రమాదం ఈశాన్య చైనాలోని డాలియన్‌ సిటీలోని మార్కెట్‌ దిగువన ఉన్న అండర్‌ గ్రౌండ్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చాలా మంది గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మంటలు భారీగా వ్యాపించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం.. నదిలో పడ్డ బస్సు.. ముగ్గురు మృతి, 28మందికి గాయాలు

Crime News: విజయనగరంలో దారుణం.. పోలీసునని బెదిరించి, ఇద్దరు గిరిజన బాలికలపై అఘాయిత్యం!