Chile Coronavirus: ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం.. అందుకు తోడు కొంప ముంచిన చైనా వ్యాక్సిన్… అన్ని దేశాల ప్రజలకు హెచ్చరిక ఏనా..!

|

May 01, 2021 | 8:19 PM

Chile Coronavirus: ప్రపంచంలోని చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా కల్లోలంలో కొట్టుకుపోతున్నాయి. ఈ వైరస్ కట్టడి కోసం..

Chile Coronavirus: ఆ దేశ ప్రజల నిర్లక్ష్యం.. అందుకు తోడు కొంప ముంచిన చైనా వ్యాక్సిన్... అన్ని దేశాల ప్రజలకు హెచ్చరిక ఏనా..!
Chile
Follow us on

Chile Coronavirus: ప్రపంచంలోని చిన్న పెద్ద, పేద ధనిక అనే తేడా లేకుండా అన్ని దేశాలు కరోనా కల్లోలంలో కొట్టుకుపోతున్నాయి. ఈ వైరస్ కట్టడి కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. చాలా ప్రాంతాల్లో కోవిడ్ వివిధ రూపాలను సంతరించుకుని తన ప్రతాపాన్ని ప్రజలపై చూపిస్తూనే ఉంది. అయితే ఇజ్రాయిల్ వంటి దేశంలో ప్రజలు ప్రభుత్వం మంచి సమన్వయంతో కరోనా ని కట్టడి చేసి.. తోలి మాస్క్ రహిత దేశంగా ఖ్యాతి గాంచితే… కోవిడ్ నిరోధానికి టీకా వేయించుకున్నాం.. ఇక మాకు కరోనా వైరస్ సోకదు అంటూ.. ఏ విధమైన నివారణ చర్యలు తీసుకోకుండా విచ్చలవిడిగా తీరిగితే ఎం జరుగుతుందో ఉదాహరణగా నిలుస్తుంది చిలీ దేశం. వివరాల్లోకి వెళ్తే..

కోవిడ్ నిరోధానికి ప్రపంచంలోనే ఎక్కువమంది పౌరులకు టీకాలు ఇచ్చిన తొలి ఐదు దేశాల్లో చిలీ మూడో స్థానంలో నిలిచింది. అక్కడ జనాభాలో 40 శాతం మందికి ఇప్పటికే టీకా తొలి డోస్ అందజేశారు. ఇజ్రాయిల్బ్రి, టన్ తర్వాత ఆ దేశంలోని ప్రజలే పెద్ద సంఖ్యలో టీకా తీసుకున్నారు.అయితే విచిత్రం ఈ దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టినప్పటి నుంచి పాజిటివ్ కేసుల నమోదు పెరుగుతుంది. దీనికి కారణం ఏమిటని అధికారులు విచారణ చేపట్టగా విస్తుబోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. చిలీలో మళ్ళీ పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం అక్కడ . ప్రజల స్వయంకృతం.. నిర్లక్ష్యం అని తేలింది.

నిజానికి కరోనా నివారణకు టీకా శాశ్వత మార్గం కాదని. వ్యాక్సినేషన్ వేయించుకున్నా ప్రజలు తగిన నియంత్రణ చర్యలు తీసుకోవాలని వైద్యులు శాస్త్రజ్ఞులు చెబుతూనే ఉన్నారు. ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తూనే ఉన్నారు..వ్యాక్సిన్ తీసుకొన్నా వైరస్ రాకుండా ఆపలేమని..అయితే ఆ వైరస్ వలన ఏర్పడే దుష్పరిణామాలను గణనీయంగా తగ్గించడానికే టీకాలని పేర్కొంటున్నారు. అయితే ప్రజలు టీకాలు, మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటివి తూ.చ తప్పకుండా అమలు చేసి మాత్రమే వైరస్‌ను జయించవచ్చని హెచ్చరిస్తున్నారు.

చిలీ ప్రజలు ఇవేమీ లెక్కచేయకుండా… వాక్సిన్ వేయించుకున్నాం అంటూ..నిర్లక్ష్యంగా ప్రవర్తించి ఇప్పుడు అందుకు తగిన ఫలితం అనుభవిస్తున్నారు. గతేడాది నవంబర్‌ నుంచి చిలీలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్ఠాయ. దీంతో అక్కడ ప్రజలు కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్‌ సీజన్‌లో షాపింగ్‌ మాల్స్‌కు ఎగబడ్డారు. పర్యాటక స్థలాలు రద్దీగా మారాయి. విదేశీ యాత్రలకు వెళ్లిన వారు అక్కడ కరోనాలోని ఇతర రకాలను దేశంలోకి తీసుకుని వెళ్లారు. దీంతో మళ్ళీ చిల్లీలో ఈ ఏడాది జనవరి మొదటి నుంచి కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అంతేకాదు ప్రజలు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడంలో కూడా బద్ధకించారు. దీంతో ఇప్పుడు ఆ దేశంలో మళ్ళీ వైరస్ వ్యాపించింది. గతం కంటే ఎక్కువగా వ్యాపించింది.

నిజానికి చిలీ దేశం.. విస్తీర్ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దగా ఉన్నా అక్కడ జనాభా కేవలం రెండు కోట్లు. ‘చిలీ’ అంటే స్థానిక ఆదిమ జాతి మాపుచి భాషలో ‘భూమి అంతమయ్యే ప్రదేశం’అని అర్ధం. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యంతో.. ప్రస్తుతం చిలీలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాది మార్చి నుంచి నవంబరు వరకు సరిహద్దులు మూసివేసి, కఠిన ఆంక్షలు అమలుచేయడంతో వైరస్ అదుపులో ఉంది. తర్వాత ఆంక్షలు సడలించి, ఆర్ధిక కార్యకలాపాలు పునరుద్ధరించడంతో వైరస్ వ్యాప్తి పుంజుకుంది. అగ్నికి వాయువు తోడై.. అడవిని దహించినట్లు.. ఆ దేశంలో కరోనా వ్యాప్తి మరింత పెరగడానికి కారణం చైనా అందించిన వ్యాక్సిన్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

చిలీ లో భారీ సంఖ్యలో చైనా సంస్థ సైనోవ్యాక్ ఉత్పత్తి చేసిన కరోనావ్యాక్‌ డోస్‌లను వినియోగించారు. అయితే, ఈ టీకా పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నట్టు ఇటీవలే స్వయంగా చైనా సీడీసీ ప్రకటించింది. తాము అభివృద్ధి చేసిన టీకాల సామర్థ్యం చాలా తక్కువని, మిగతా వాటిని కలిపి వినియోగించడంపై పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. మరోవైపు బ్రెజిల్ కూడా చైనా టీకాల పనితీరుపై పలు అధ్యయనాలు నిర్వహించి .. అవి 50 శాతం మేర మాత్రమే సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు ప్రకటించాయి. దీంతో ప్రస్తుతం చిలీ దేశంలో మళ్ళీ వైరస్ విజృంభణకు ప్రజల నిర్లక్ష్యానికి తోడు చైనా టీకా కారణమయ్యాయని టాక్ సర్వత్రా వినిపిస్తోంది. అంతేకాదు.. చిలీ దేశ ప్రజల ను చూసి.. మిగతా దేశ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నాయి కూడా..!

Also Read: కరోనా వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించినట్లు లంగ్స్ ముందే అలెర్ట్ చేస్తాయంటున్న శాస్త్రజ్ఞులు.. ఎలా తెలుసుకోవాలంటే..!