పిల్లలకు ఇక కరోనా వైరస్ వ్యాక్సిన్ మోడెర్నా , అమెరికాలో తొలిసారిగా ప్రయోగాత్మక ట్రయల్స్ ప్రారంభం ?

| Edited By: Phani CH

Mar 16, 2021 | 8:40 PM

పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్  మోడెర్నా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికాలో తాము 6 నెలల నుంచి 12 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లలకు ఈ  వ్యాక్సిన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని మోడెర్నా కంపెనీ ప్రకటించింది.

పిల్లలకు ఇక కరోనా వైరస్ వ్యాక్సిన్ మోడెర్నా , అమెరికాలో తొలిసారిగా ప్రయోగాత్మక ట్రయల్స్ ప్రారంభం ?
Moderna Vaccine
Follow us on

పిల్లలకు కూడా కరోనా వైరస్ వ్యాక్సిన్  మోడెర్నా ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అమెరికాలో తాము 6 నెలల నుంచి 12 ఏళ్ళ మధ్య వయసు గల పిల్లలకు ఈ  వ్యాక్సిన్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టామని మోడెర్నా కంపెనీ ప్రకటించింది. ఈ దిశగా సుమారు ఆరున్నరవేల మందికి పైగా పిల్లలను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నామని ఈ సంస్థ పేర్కొంది. అమెరికా, కెనడా దేశాల్లో ఫేస్ 2/3 స్టడీని ప్రారంభిస్తామని, ఇందుకు సంతోషిస్తున్నామని ఈ సంస్థ  వెల్లడించింది. పెద్దవారితో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ 19 లక్షణాలు స్వల్పంగా ఉంటాయని, అయితే ఈ వైరస్ వ్యాప్తికి కూడావ వీరు కూడా  కారకులవుతారని  ఈ కంపెనీ సీఈఓ స్టెఫానీ తెలిపారు.కొంతమంది పిల్లల్లో అసలు లక్షణాలే కనబడవన్నారు .  అమెరికాలో సాధ్యమైనంత త్వరగా స్కూళ్లను ప్రారంభించనున్న నేపథ్యంలో మోడెర్నా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ దేశంలో 17 మిళియన్లకు పైగా మోడెర్నా వ్యాక్సిన్ తీసుకున్నారు. కాగా పిల్లలకు సంబంధించి తమ వ్యాక్సిన్ ఇచ్చే విషయంలో ఈ సంస్థ ఇంకా ప్రభుత్వ అనుమతిని తీసుకోవలసి ఉంది. తమ ట్రయల్స్ ని ఎప్పుడు ప్రారంభించేదీ త్వరలో తెలియజేస్తామని మోడెర్నా వెల్లడించింది. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కంపేనీ ప్రకటనపై ఇంకా స్పందించాల్సి ఉంది. ఇప్పటివరకు పిల్లల్లో  కోవిడ్ వ్యాప్తిపై   ఈ సంస్థ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇక కెనడాలో కూడా 6 నెలల నుంచి 12 ఏళ్ళ వయస్సు గల పిల్లలకు  మోడెర్నా వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టామన్న ప్రకటనపై ఆ దేశ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

 

మరిన్ని ఇక్కడ చదవండి: Hyderabad Water Supply Alert : హైదరాబాద్ లో మంచినీటి సరఫరాలో అంతరాయం.. ఏ ఏ ప్రాంతాల్లో అంటే.

Bhainsa ASP Kiran : తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం.. బైంసా ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి కిరణ్ నియామకం..