AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earthquakes: గత 20 ఏళ్లలో సంభవించిన టాప్ 5 భూకంపాలు.. వాటి వివరాలు..

నిన్న టర్కిలో సంభవించిన భూకంపం కారణంగా క్షణక్షణానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయిందని..

Earthquakes: గత 20 ఏళ్లలో సంభవించిన టాప్ 5 భూకంపాలు.. వాటి వివరాలు..
Top 5 Earthquakes In Last 20 Years
శివలీల గోపి తుల్వా
|

Updated on: Feb 07, 2023 | 11:55 AM

Share

వరుస భూకంపాలతో టర్కీ (తుర్కియా) అతలాకుతలం అవుతోంది. నిన్న(ఫిబ్రవరి 6) ఉదయం 4.17 గంటలకు దక్షిణ టర్కీలో భూమి కంపించి వందలాది బిల్డింగ్‌లు నేలమట్టమయ్యాయి. ఈ క్రమంలో క్షణక్షణానికి మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయిందని జర్మన్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ జియోసైన్సెస్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే మరోమారు ఈ రోజు(ఫిబ్రవరి 7) ఉదయం రిక్టర్ స్కేలుపై 5.6 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. టర్కీతో పాటు సిరియాలో భూకంపం వల్ల చనిపోయిన వారి సంఖ్య 4,300 లకు చేరింది. ఈ ప్రకృతి విపత్తు కారణంగా భవన శిథిలాల కింద పడి ఇప్పటికీ వేలాది మంది చిక్కుకున్నట్లు ఆయా దేశాల అధికారులు చెబుతున్నారు.

అయితే గడిచిన ఇరవై ఏళ్లలో అత్యధికంగా ప్రాణ,ధన, ప్రకృతి వినాశనం సృష్టించిన భూకంపాలలో ఇదొకటని పర్యావరణ నిపుణులు, భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గత ఇరవై ఏళ్లలో భారీ వినాశనానికి కారణమైన (టర్కీ, సిరియా సహా) ఐదు భూకంపాల వివరాలు మన ఇప్పుడు తెలుసుకుందాం..

  1. సుమత్రా దీవులు(2004): ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 ఏడాది భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో రిక్టర్ స్కేలుపై 9.2 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో సుమత్రా దీవుల్లో కనీవినీ ఎరగని విధ్వంసం నెలకొంది. ఈ దుర్ఘటనలో 2,30,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
  2. జపాన్(2011): జపాన్‌లోని తొహకు ఏరియా భూకంపం కారణంగా 2011లో వణికిపోయింది. భూకంపం ధాటికి భారీ నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 9.1 పాయింట్లుగా నమోదైంది. ఈ విధ్వంసంలో 15,899 మంది చనిపోయినట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది.
  3. ఇవి కూడా చదవండి
  4. పాకిస్థాన్(2013): 2013లో వెస్ట్రన్ పాకిస్థాన్‌లో భారీ భూకంపం ఏర్పడింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైంది. ఈ భూకంపం ధాటికి వేలాది ఇళ్లు నేలకూలాయి. పెద్ద సంఖ్యలో జనం నిరాశ్రయులయ్యారు. మొత్తంగా 350 మంది చనిపోయినట్లు అధికారులు అంచనా వేశారు.
  5. నేపాల్(2015): 2015 నేపాల్ లోని గోర్ఖా వాసులకు ఎంతో విషాదాన్ని మిగిల్చిన సంవత్సరంగా నిలిచింది. ఉన్నట్టుండి కాళ్లకింద భూమి కంపించడంతో ప్రజలు వణికిపోయారు. కళ్లముందే పెద్ద పెద్ద భవనాలు నేలకూలుతుంటే భయంతో ఆర్తనాదాలు చేశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 8,964 మంది ప్రాణాలు కోల్పోగా 21,952 మంది గాయాలపాలయ్యారు. సుమారు 35 లక్షల మంది నిరాశ్రయులయ్యారని నేపాల్ ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..