AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మాటలకందని విషాదం.. భూకంపం ధాటికి రెండుగా చీలిపోయిన రన్‌వే.. షాకింగ్‌ వీడియో..

వరుస భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఎటు చూసినా కూలిపోయిన బిల్డింగ్‌లు.. పేరుకుపోయిన శిథిలాలు.. వాటి కింద నుంచి వెలికితీస్తున్న శవాలే కనిపిస్తున్నాయి.

Watch Video: మాటలకందని విషాదం.. భూకంపం ధాటికి రెండుగా చీలిపోయిన రన్‌వే.. షాకింగ్‌ వీడియో..
Turkey Earthquake
Shaik Madar Saheb
|

Updated on: Feb 07, 2023 | 1:28 PM

Share

వరుస భూకంపాలతో టర్కీ, సిరియా దేశాలు విలవిలలాడుతున్నాయి. ఎటు చూసినా కూలిపోయిన బిల్డింగ్‌లు.. పేరుకుపోయిన శిథిలాలు.. వాటి కింద నుంచి వెలికితీస్తున్న శవాలే కనిపిస్తున్నాయి. హహకారాలు.. ఆర్తనాదాలతో టర్కీ కన్నీరు పెడుతోంది. భూకంపం ధాటికి చెల్లాచెదురైపోయిన టర్కీ, సిరియా దేశాల్లో ఎక్కడ చూసినా విపత్కర పరిస్థితులే నెలకొన్నాయి. వరుస భూకంపాల ధాటికి అక్కడ ఇప్పటివరకు దాదాపు 5వేల మంది మృత్యువాత పడ్డారు. అధికారిక లెక్క ప్రకారం.. 4500 మందికి పైగా మరణించగా.. మరణాలు ఇంకా 8రెట్లు ఎక్కువ ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. భూకంపం ధాటికి అందమైన నగరాలు మరుభూమిగా మారిపోయాయి. ఇప్పటికే 4వేలకు పైగా శవాలు వెలికి తీయగా.. వేలాది మంది గాయాలతో కన్నీరుపెడుతున్నారు. ఆసుపత్రులన్నీ బాధితులతో నిండిపోయాయి.

కాగా.. భూకంపం ధాటికి టర్కీలోని చాలా ప్రాంతాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. అందమైన భవానాలు, విమానాశ్రయాలు సైతం దెబ్బతిన్నాయి. ఘోర ప్రకృతి విపత్తు పెను నష్టాన్ని మిగిల్చింది. టర్కీ, సిరియా దేశాల సరిహద్దుల్లో సోమవారం వరుసగా సంభవించిన భూకంపాలతో ఆస్తులు సహా భారీ ప్రాణ నష్టం వాటిల్లింది. టర్కీలోని హతయ్‌ ప్రావిన్స్‌లోని ఎయిర్‌పోర్టులో ఉన్న ఒకే ఒక్క రన్‌వే భూ ప్రకంపనల ధాటికి రెండు ముక్కలై పూర్తిగా పనికిరాకుండా పోయింది. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

భూకంప తీవ్రతకు ఒక్క టర్కీలోని 5600లకు పైగా భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ ఘోర విపత్తు కారణంగా రెండు దేశాల్లో ఇప్పటివరకు 4500 మందికిపై మృత్యువాత పడగా.. దాదాపు 20వేల మంది గాయపడ్డారు. అయితే శిథిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని తెలుస్తోంది. ఇదిలాఉంటే.. టర్కీ, సిరియా రెండు దేశాల్లోని భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్
వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్